Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవింద్‌నాయక్
నవతెలంగాణ - ములుగు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా గతేడాది చేసిన పనికి డబ్బులు రాలేదని వాటిని వెంటనే చెల్లించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ అన్నారు. మండలంలోని పత్తిపల్లి గ్రామ పరిది చింతలపల్లిలో ఉపాధి హామీ కూలీలను గురువారం ఉదయం కలిసి వారి పని వివరాలు, హాజరు, డబ్బుల చెల్లింపు వివరాల గురించి మెట్ వర్మను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కూలీల సమస్యలను ఏపిఓకి చరవాణి ద్వారా సమాచారం తెలిపి వెంటనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తరువాత కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. క్రమ క్రమంగా నిర్వీర్యం చేస్తు న్నదని అన్నారు. ఈ పథకాన్ని రక్షించుకోవాల్సిన భాధ్యత మన అందరి పై ఉందని అన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు అరటి పండ్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భుక్య మురళి,ముత్త కొమురయ్య, ఏనగందుల మొగిలి,ముత్త సంపత్, మామిడాల కోమల్ రెడ్డి,గుంటి రవి,జితేందర్ తదితరులు పాల్గొన్నారు.