Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహాముత్తారం
మహాముత్తారం మండలం లొని వజినేపల్లి గ్రామపంచాయతీ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్, పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన ఆకుదారి మాధవి, ఒడిదల త్రిష, బొచ్చు శైనిశ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మండల్ జనం సాక్షి విలేఖరి గోక సదానందం ఘనంగా వారికి శాలువలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు వారికి ప్రతిరోజు స్కూల్ కి పంపుతూ పై చదువులు చదివి ఉన్నంత స్థాయికి ఎదగాలని విధంగా వారిని ప్రోత్సహించాలని అన్నారు. మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి పేరు రావాలంటే ఉన్నతమైన చదువులు చదివి వారి యొక్క సంతోషాన్ని మీరు నిలబెట్టాలని సూచించారు. మనవజినేపల్లి గ్రామం నుంచి చదువుకునే వయసులో చదువులు మానేసి ఇంటికాడ ఉంటే మంచిది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బొచ్చు రాజులు సులోచన, ఆకు దారి సడవలి పోచమ్మ, ఒడిదల కుమారస్వామి పద్మ. వార్డు సభ్యులు జక్కుల లక్ష్మి, గోక శ్రీనివాస్, కావట్టి మల్లయ్య, అక్కల స్వామి, అంగన్వాడి ఆయా భూపెల్లి సుశీల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.