Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీరా సేవిస్తే ఆరోగ్యానికి మంచిదన్న మంత్రి
నవతెలంగాణ-పాలకుర్తి
ఏదైనా పథకాన్ని ప్రారంభించడమే కాదు ఆ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తూ తెలుసుకోవడం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అలవాటు. ఆయా పథకాల లోటుపాట్లను కూడా అంచనా వేస్తూ సమర్థవంతంగా ఆయా పథకాలను ప్రజలకు అందే లా చేయడం ఆయన నైజం. అలా మూడేళ్ల కింద తన సొంత ఖర్చులతో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గిరకతాటి చెట్లను మంత్రి ఎర్రబెల్లి గీతా కార్మి కులకు పంపిణీ చేశారు. అప్పుడప్పుడు ఆయా పర్యటనల్లో ఆ గిరిక తాళ్లు ఎలా ఉన్నాయి? ఏపుగా పెరిగాయా?! కల్లు (నీరా) వస్తుందా? అంటూ ఆరా తీస్తూ ఉంటారు. గురువారం పాలకుర్తి నియోజ కవర్గంలో పలు పరామర్శలు చేస్తూ, వివాహ వేడు కలకు హాజరవుతూ మంత్రి పర్యటించారు ఈ సం దర్భంగా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో 3 సంవ త్సరాల క్రితం తాను పంపిణీ చేసిన గిరక తాడు కి నేడు కల్లు పారుతున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి, ఆ కల్లును సేవించారు. కల్లు కు అందునా గిరిక తాటి కల్లు కు ఔషధ గుణాలు ఉన్నాయని, సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. అంతేకాదు గిరక తాటి చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నా రు. మూడేళ్ల క్రితమే తాను స్వయంగా గిరకతాటి చెట్లను పాలకుర్తి నియోజకవర్గంలో పంపిణీ చేశానని తెలిపారు. ప్రస్తుతం అభి కల్లుని ఇస్తున్నాయని ఆ కల్లును సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆ కల్లుకు మంచి డిమాండ్ ఉందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.