Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మన్ కోరం హామీ
నవతెలంగాణ-బయ్యారం
మండలంలో పలు కారణాలతో బాధపడుతున్న పలువురిని శుక్రవారం మా జీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పరామ ర్శించి అధైర్య పడొద్దు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీ గంధంపల్లి గ్రామానికి చెందిన మాచర్ల వెంకటే శ్వర్లు సతీమణి క్యాన్సర్ సంభందిత వ్యాధితో బాధపడుతూ శస్త్ర చికిత్స నిర్వ హించుకుని కోలుకుంటున్న తరుణంలో కుమార్తె చందనకు అకస్మాత్తుగా కంటి చూపు కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండగా విషయం తెలుసుకోని వారి ని పరామర్శించి, హైదరాబాద్లోని ప్రముఖ వైద్యశాలలోని వైద్యుడితో చరవా ణిలో మాట్లాడిన అనంతరం కంటిచూపుకు సంభందిత పూర్తి బాధ్యత తనదేన ని, హామీ ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన వికలాంగురాలు పగిళ్ళ రాణికి అం గవైకల్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, మూడు చక్రాల వాహనం కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్న అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విన్న వించగా, సంభందిత శాఖా అధికారితో మాట్లాడి త్వరితగతిన సమస్యకు పరి ష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు వెంకటేశ్వ ర్లు, రమణ, రమేష్, లక్ష్మణ్ రావు, కాంతారావు, నాయకులు రాసమల్ల నాగేశ్వర రావు, పోతుగంటి సుమన్, బోయిన లింగయ్య, పోతుల లింగయ్య, నుద్దునూరు లింగయ్య, భద్రయ్య, సతీష్, రావూరి సతీష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.