Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మన ఉక్కు మనిషి దుర్గాబాయి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 09,2023

మన ఉక్కు మనిషి దుర్గాబాయి

        మహిళలు నాలుగు గోడలు దాటి అడుగు బయట పెట్టడమే తప్పుగా భావించే రోజులవి. ఏన్నో కట్టుబాట్లు, ఆంక్షల మధ్య వారి జీవితాలు గడిచిపోతుండేవి. అటువంటి రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. అంతేకాదు ఒక సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆమే చెన్నై, హైద్రాబాద్‌ నగరాల్లో ఆంధ్ర మహిళా సభలను స్థాపించిన దుర్గాబాయి దేశముఖ్‌. ఈ రోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆ స్ఫూర్తిదాయక జీవితాన్ని ఒకసారి మననం చేసుకుందాం...
            దుర్గా బాయి 15, జులై 1909 రాజమండ్రి లోని రామారావు, కృష్ణవేణి దంపతులకు జన్మించారు. వీరిది మధ్య తరగతి కుటుంబం. 8 ఏండ్ల వయసులో ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహం జరిగింది. అయితే కొంత ఊహ తెలిసాక చదువు పై దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకిచించారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఇష్టానికి మద్దతు పలికారు. ఇక అప్పటి నుండి దుర్గాబారు చదువుపై దృష్టి పెట్టి బెనారస్‌ విశ్వ విద్యాలయం నుండి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్మె పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేశారు. 1942లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకుని మద్రాసు హై కోర్ట్‌లో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు.
12 ఏండ్ల వయసులోనే...
            దుర్గాబాయి చిన్నతనం నుండే స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. తన 12 ఏండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు. రాజమండ్రిలో బాలికలకు హిందీ విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. తెలుగు గడ్డపై మహాత్మాగాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏండ్ల వయసులో విరాళాలు సేకరించి ఆయనకు అందచేశారు. అంతేకాదు ఆంధ్ర పర్యటనలలో గాంధీజీ హిందీ ఉపన్యాసాలు తెలుగులోకి అనువదించారు. దుర్గాబారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనప్పుడు మహిళ అని కూడా లేకుండా బ్రిటిష్‌ ముష్కరులు విచక్షణా రహితంగా లాఠీ చార్జీ చేసారు. ఆ సమయంలో రెండు చేతులకు గాయాలై రక్తం కారుతున్నా తన పిడికిలిలో చిక్కుకున్న గుప్పెడు ఉప్పును మాత్రం నేల జారనియ్యని చైతన్యవంతురాలు.
దేశముఖ్‌తో పరిచయం...
            1937లో చెన్నైలో ఆమె ఆంధ్ర మహిళా సభను ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలు తానే స్వయంగా చూశారు. అంతేనా దుర్గాబారు భారత దేశ రాజ్యాంగ సభ, ప్రణాళిక సంఘం సభ్యురాలు. భారత రాజ్యాంగ నిర్మాణసభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేశారు. తర్వాత 1952లో ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యురాలిగా కూడా పని చేశారు. ఆ సమయంలో దేశముఖ్‌తో ఏర్పడిన పరిచయం వారి వివాహానికి దారి తీసింది. అప్పటి నుండి దుర్గాబారు దేశముఖ్‌గా ఆవిడ ప్రాచుర్యం పొందారు.
స్టోన్‌ దట్‌ స్పీక్‌
            దుర్గాబాయి తన అనుభవాలతో 'స్టోన్‌ దట్‌ స్పీక్‌' పేరిట ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ ''ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి, కాలం విలువను అర్థం చేసుకో గలిగిన వ్యక్తి, ప్రణాళిక బద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తి, ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో, దానికి అనుస రించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభ కారకాలనూ, మోహ కారకా లనూ జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపా దించి తీసుకురాగలడేమో కానీ కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకురాలేవు. అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగ రాస్తారు' అని అన్నారు. ఎంతో అద్భుతమైన వాక్యాలు ఇవి. ఈ ప్రతి పదంలోను, వాక్యంలోను ఎంతో అర్ధం ఉంది.
స్ఫూర్తిదాయక జీవితం
            మహిళా సంక్షేమం, సాధికారత కోసం విశిష్ట సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలను గుర్తించేందుకు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఆమె పేరు మీద వార్షిక అవార్డును ఏర్పాటు చేసింది. అక్షరాస్యత రంగంలో విశేష కృషి చేసినందుకు యునెస్కో అవార్డు కూడా ఆమెకు లభించింది. దుర్గాబాయి అందరికీ స్ఫూర్తి. ఒక రచయిత్రిగా, స్వతంత్ర సమర యోధురాలిగా, న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా ఆవిడ ఎదుర్కొన్న సమస్యలు, వివక్షలు ఆమెను భారత ఉక్కుమనిషిగా నిలబెట్టాయి. బ్రిటిషు వారికి ఆడ సింహంగా, ధీరవనితగా పేరు గడించారు. అందరినోటా కీర్తించ బడ్డ దుర్గాబారు 1981 మే 9న తుది శ్వాస విడిచారు. ఓ తెలుగింటి ఆడబడుచు తెలుగు రాష్ట్రాలు గర్వించే విధంగా జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ రోజున ఆమెను స్మరించుకుంటూ, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ
మహిళా విద్య కోసం...
            1953 ఆగస్టులో భారత ప్రభుత్వం నెలకొల్పిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్‌ రిలీజ్‌ అసోసియేషన్‌కు అధ్యక్షురాలుగా పనిచేశారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకై పాటుపడ్డారు. రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతి గృహాలు, నర్సింగ్‌ హోములు, వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పారు. 1971లో నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యా సేవలకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందారు. 1975లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ అవార్డును ఇచ్చి సత్కరించింది.
- పాలపర్తి సంధ్యారాణి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్వాస ఉన్నంత వరకు చదువు చెప్తా...
వేసవి టాన్‌ను తొలగించాలంటే...
ఆట అమ్మాయిలకు శక్తినిస్తుంది
వేసవిలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..
ఒక్క బిడ్డతో ప్రారంభమై...
ఎక్కడైనా నెగ్గొచ్చు
నిత్య శ్రామికురాలు అమ్మ
ఆప్యాయతల కలపోత 'అపురూపం'
పట్టిన చీడ వదలకపోతే..?
వేసవిలో చర్మ సంరక్షణకు...
మాతృ వందనం...
మధుమేహకులకు నోరూరే వంటలు
ఏకాగ్రత ముఖ్యం
మృతకణాలను తొలగించండి
విజయానికి సంకేతం సుజాత జీవితం
ఇల్లు మారాలనుకుంటే..?
కొన్నింటికి దూరంగా ఉండాలి
అక్షరం ఆరోగ్యం వెరసి ఆలూరి
ఊపిరున్నంత వరకు సమాజం కోసమే...
చెమట పడుతుందా..?
ఏది తప్పు ఏది ఒప్పు
ఇల్లు పీకి పందిరేస్తున్నారా..?
అధిగమించడం ఎలా..?
బామ్మల వంట.. నోరూరేనంట
ఎక్కువ కాలం మన్నాలంటే..?
సహజంగా అదుపు చేద్దాం
పదినిమిషాల్లో రెడీ
ఆసక్తి తగ్గుతుందా..?
వివక్షపై అక్షర పోరాటం
నిమ్మతో శుభ్రం...

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.