Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. సూర్య కిరణాలు, తేమ, గాలిలోని కాలుష్య కారకాల వల్ల చర్మం నిస్తేజంగా, జిడ్డుగా మారుతుంది. చెమట తెచ్చే చిరాకు కూడా ఎక్కువే. చర్మం నల్లబడిపోతుంటుంది. పొడిబారి పోతుంది. వీటితో పాటు అనేక సమస్యలు వస్తుంటాయి. అందుకే బయటకు వెళ్తే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీనితో పాటు కొన్ని చర్మ సంరక్షణలు కూడా తీసుకోవాలి.
కొత్తిమీర : మనకు ఇండ్లలో తప్పనిసరిగా కొత్తమీరను కూరల్లో వాడేందుకు నిల్వ చేస్తుంటారు. ఇందులోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంలోని ట్యాక్సిన్లను బయటకు పంపడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని అందంగా మారుస్తాయి.
పసుపు : వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ కణజాలాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ వాపును తగ్గిస్తుంది. చర్మం ఆకర్షణీయమైన రంగులో ఉండేందుకు సహాయపడుతుంది. దీనిని పేస్టు రూపంలో చర్మంపై అప్లై చేసుకోవచ్చు.
వేప :
వేప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో అనేక ఆయుర్వేద ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సంరక్షణలోనూ వేప చాలా బాగా దోహద పడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో చర్మాన్ని డిటాక్స్ చేస్తుంది. చెమటతో మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిచేందుకు సహాయకారిగా ఉంటుంది. మొటిమలను నివారిం చడంలోనూ దీని పాత్ర ఎక్కువే. వేపను నూనె రూపంలో, పొడి రూపంలో చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు.