Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టాలెంట్ ఎక్కడకున్నా గౌరవించాలనుకోవడం నా స్వభావం. ఆలస్యం చేసే కొద్దీ నా వయసు రీత్యా, వారి వయసు రీత్యా ఆ అవకాశం దొరక్కుండా పోతుందేమోనన్న అభిప్రాయం నాది' అంటారు అమృతలత. అందుకే ఆమె వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల కోసం 'అమృతలత - అపురూప అవార్డ్స్'ని పన్నెండేండ్ల కిందట నెలకొల్పారు. వయసు ఏడు పదులు దాటినా ఆమెలో ఎక్కడా అలసట కనపడదు. ప్రతి ఏడాది మాదిరిగానే ఏడాది కూడా మాతృదినోత్సం సందర్భంగా ఈరోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నారు.
ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 24 మంది మహిళలను 'అమృత లత జీవన సాఫల్య పురస్కా రాలతో ఆమె గౌరవించారు. ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన 97మంది మహి ళలను 'అపురూప అవార్డు' లతో సన్మా నించారు. ఆమె జన్మస్థలమైన నిజామా బాద్‌లో పుట్టి, వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న కళా కారులూ, సాహితీవేత్తల కొరకు 'ఇందూరు అపురూప అవార్డ్స్' నెలకొల్పారు. ఇప్పటి వరకు 46మంది పురుషులకూ, 23 మంది స్త్రీలకూ ఆ పురస్కారాలతో గౌరవించారు. ఇప్పటికి ఈ మూడు రకాల అవా ర్డులు తీసుకున్న స్త్రీ పురుషుల సంఖ్య 201కు చేరిందని ఆమె ఎంతో సంతోషంగా చెబుతున్నారు.
సహకారం అనన్య సామాన్యం
'ఇన్ని రోజులు అవార్డులలో సింహభాగం సీనియర్స్కే లభించాయి. ఇక ముందు కొంత మేర యువశక్తికి కూడా చోటు కల్పించాలని అనుకుంటున్నాం. వారి వివరాలన్నీ 'అభినందన' సావనీర్ల రూపంలో, వీడియోల రూపంలో అందరికీ త్వరలో అందుబాటులో ఉంటాయి. ఇవి ఆయా వ్యక్తులపై పరిశోధన చేయాలనుకునే వారికీ, ముఖ్యంగా భావి తరాలవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. దీని కోసం అడుగడుగున్నా నా వెన్నంటే వుంటూ, నా కలలను సాకారం చేస్తోన్న నెల్లుట్ల రమాదేవి, కిరణ్బాలల కృషి అనన్య సమాన్యం'' అంటారు అమృతలత.
2023 అవార్డును అందుకోబోయే వారు
- ప్రముఖ నవలా రచయిత గంటి భానుమతి, విద్యారంగం నుండి డా.పి. విజయలక్ష్మి పండిట్, సినీ రంగం నుండి సంగీత, శాస్త్ర సంగీతం ప్రొ.ద్వారం లక్ష్మి 'అమృతలత జీవనసాఫల్య పురస్కారం' అందుకోబోతున్నారు.
- మాణిక్యేశ్వరి (జర్నలిజం), ఆలపాటి లక్ష్మి (రంగస్థలం), మందరపు హైమావతి (కవిత్వం), మహెజబీన్ (మహిళా భ్యుదయం), జ్యోతి వలబోజు (పుస్తక ప్రచురణ), శైలజా మిత్ర (సాహితీ విమర్శ), డా.కె.రత్నశ్రీ (శాస్త్రీయ నృత్యం), డా.కె.ఎన్.మల్లీశ్వరి (కథారచన), పి.జ్యోతి (వ్యాసరచన) అపురూప అవార్డులు అందుకోబోతున్నారు.
నాకు దక్కిన గొప్ప అవకాశం
- నెల్లుట్ల రమాదేవి
పదకొండ్లే కిందట అమృతలత మదిలో పుట్టిన ఈ అపురూప అవార్డులు ఈ దశాబ్ద కాలంలో ఇంత మంచి పేరు వస్తుందని కానీ, ఇంత ప్రాధాన్యత సంతరించు కుంటాయని గానీ అప్పట్లో అనుకోలేదు. ఆమె ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా ఎక్కడ ఏ మాత్రం ప్రతిభ, కళ ఎవరిలో కనిపించినా వాళ్ళను అభినందించ కుండా సత్కరించకుండా ఉండలేరు. అంతటి కళాభిమాని ఆమె. ఆ అభిమా నంలోంచే రూపుదిద్దుకున్నదే ఈ అవార్డులు. మొదటి కార్యక్రమం నుండి నన్ను కన్వీనర్‌గా ఎంచుకోవడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. సభ ఎంత వైభవంగా జరిగినా కొన్నాండ్లకి జనం మర్చి పోతారు. అలా కాకుండా అతిథుల, అవార్డు గ్రహీతల పరిచయ వ్యాసాలతో కూర్చిన ప్రత్యేక సంచిక 'అభినందన' అపురూప అవార్డులకే ప్రత్యేకం.