Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పల్లె దావఖానా డాక్టర్లను నియమకం చేసింది. శుక్రవారం పల్లెదావఖానను 11గంటలు దాటినా తెరవకపోవడంతో చూపించుకోవడానికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు మండలంలో ఏడు సబ్ సెంటర్లకు గాను కొల్లూరుకు లేక పోగా మిగతా ఆరు సబ్ సెంటర్లలో పల్లె దావకాణా డాక్టర్లను నియమించారు. డాక్టర్లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు సబ్ సెంటర్‌లో ఉండాలి. కానీ ఏ ఒక్కరూ కూడా సమయానికి రాకపోగా సబ్ సెంటర్లకు రావాలంటే మొఖం చాటేసుకుంటున్నారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. పల్లె దావఖానా డాక్టర్ తో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఉదయం సెంటర్ కు వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోవాలి. కానీ ఏ ఒక్క సెంటర్ కూడా సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆవేదనతో చెబుతున్నారు. ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లలేక పల్లె దావకా నలో ఏర్పాటు చేసిన డాక్టర్ తోనే వైద్యం చేయించుకుందామని అనుకున్న వారు సమయానికి రాకపోవడం బాధాకరమంటున్నారు.
11 దాటిన పల్లె దావకాన తెరువలే.
మండలంలోని గొలనుకొండ గ్రామంలో శుక్రవారం ఉదయం 11 దాటిన పల్లె దావకాన తెరవకపోవడంతో గ్రామంలో ఉండే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఒక్కరోజు కాదు రోజు కూడా తిరగడం లేదని గ్రామస్తులు అంటున్నారు మా గ్రామం కాకుండా ఏ గ్రామంలో కూడా పల్లె దావకాన డాక్టర్లు ఉంటారని సమాచారం లేదంటున్నారు. కనీసం డోర్ తీయకుండా ఉండడం అది చూసిన రోగులు వెనక్కి మళ్లిపోతున్నారు.
లేటుగా వస్తున్నారు...
సమయానికి రమ్మని చెబుతా
సారాజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నవీన్ కుమార్
మండలం నుండి గ్రామానికి రావాలంటే ఆటో ద్వారా రావాల్సి వస్తుంది. అందుకే లేటుగా వస్తున్నారు. ఆశ వర్కర్లు ట్రైనింగ్‌కు వెళ్లారు. ముందు ముందు సమయా పాలన పాటించమని చెబుతా. ఎక్కడ సమస్య రాకుండా చూసుకుంటా.