Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ మహ్మద్ నజీరుద్దీన్
నవతెలంగాణ-కోదాడరూరల్
సనా ఇంజనీరింగ్ కాలేజీలో జాతీయ సాంకేతిక దినోత్సవం బీటెక్ విద్యార్థులచే ఘనంగా శుక్రవారం నిర్వహించారు.సనా ఇంజనీరింగ్ కాలేజీ చైర్మెన్ మహ్మద్ నజీరుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు కొత్త సాంకేతిక ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సాధించి విద్యార్థులు గొప్ప పేరు తెచ్చుకోవాలన్నారు.స్థిరమైన భవిష్యత్ కోసం సైన్స్అండ్ టెక్నాలజీలలో విద్యార్థులు సమగ్ర విధానం అవలంబించుకోవాలన్నారు.భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవానికి ముఖ్యమైన చారిత్రక ప్రాముఖ్యత ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సనా ప్రిన్సిపాల్ పెరుమళ్ళ గాంధీ, వైస్‌ప్రిన్సిపాల్ ఇర్ఫాన్,రఫీ, ప్రముఖ సాంకేతిక సలహాదారులు మేకల రామారావు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.