Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
సమాజ సేవలో సుమన్ యువసేన సేవలు అభినందనీయమని జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు గండూరి కృపాకర్ చల్లా లక్ష్మి కాంత్లు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద సుమన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద హనుమాన్ జయంతి, మాతృ దినోత్సవ సందర్భంగా వ్యాపారవేత్త డోగుపర్తి ప్రవీణ్ కుమార్ అనిత ల పెళ్లిరోజు సందర్భంగా వారు సహకారంతో పేద ప్రజలకు బాటసారులకు పులిహోర పంపిణీ చేశారు.మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమన్ యువసేన చలివేంద్రంలో సుమన్ యువసేన సభ్యులు పాలవరపు నరసింహారావు రాజేష్ లు తన తల్లి అరుణ జ్ఞాపకార్థం బాటసారులకు పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమన్ యువసేన జిల్లా అధ్యక్షులు గుండా వెంకన్న మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం మాతృ దినోత్సవ సందర్భంగా పేద ప్రజలకు మండుటెండలో మజ్జిగ అన్నం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన చలివేంద్ర నిర్వాహకులు గోపారపు రాజు, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మీప్రసాద్, కర్నాటి రంగయ్య, యామ కిరణ్, కర్నాటి నరసింహారావు, పాలవరపు కృష్ణమూర్తి,పాలవరపు రాజేష్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.