Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలంలోని లింగాల గ్రామ క్రాస్ రోడ్డు వద్ద గ్రామానికి చెందిన దాచేపల్లి పెద్దవెంకయ్య-లింగమ్మ దంపతుల జ్ఞాపకార్థం కుమారుడు దాచేపల్లి సుధాకర్ చేపడుతున్న లింగాల గ్రామ ప్రాంగణ ద్వారానికి ఆదివారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పురోహితులు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, సర్పంచ్ మామిడి వెంకన్న, పిఎసిఎస్ చైర్మెన్ వెన్న సీతారాంరెడ్డి, సర్పంచ్ చెన్ను శ్రీనివాసరెడ్డి, నాయకులు రణపంగ సైదులు, నల్లపు రామ్మూర్తి, ఏసురాజు దుర్గయ్య, మామిడి నవీన్, మామిడి శోభన్, రణపంగ దుర్గయ్య, మహబూబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.