Authorization
Sun May 04, 2025 04:43:29 am
జెరూసలేం : యూదులు, అరబ్ ప్రదర్శనకారుల మధ్య అల్లర్లు, ఘర్షణలతో జెరూసలేం పట్టణం ఉద్రిక్తంగా మారింది. వీరు ఒకరితో ఒకరు ఘర్షణ పడటమే కాకుండా, పోలీసులపై కూడా దాడులకు దిగారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ ఈ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. 'అరబ్బులను చంపివేయండి, మీ గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తాం' వంటి నినాదాలతో యూదులు రెచ్చిపోయారు. అల్లర్లను అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జలఫిరంగులు, లాఠీలతో నిరసనకారులను అదుపు చేయడానికి ప్రయత్నించారు. 79 మందిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.