Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లు కోల్పోతున్న పోలెండ్
వార్సా : రష్యా నుంచి చమురు దిగుమతిపైన పోలండ్ ఆంక్షలు విధించింది. దీంతో పోలండ్ ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రష్యా చమురు ధరతో పోలిస్తే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు ధర చాలా ఎక్కువ. దీంతో పోలెండ్ ప్రతిరోజూ 27మిలియన్ డాలర్లను అదనంగా చమురు దిగుమతిమీద వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడిందని పోలెండ్ ప్రభుత్వ చమురు సంస్థ పీకేఎన్ ఓర్లెన్ సీఈఓ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెప్పాడు. తమకు ఈ స్థాయిలో నష్టం జరుగుతున్నప్పటికీ పోలెండ్ రష్యాపై ఆక్షలను విధించవలసిందేనని గట్టిగా పట్టుపడుతోంది.
రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవటం ఆపాలని పోలెండ్ 2022 మార్చిలో నిర్ణయించింది. అంటే పీకేఎన్ ఓర్లెన్ ప్రతి బ్యారెల్‌కు 30డాలర్లు అదనంగా చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని డేనియల్ ఒబాజ్టెక్ తెలిపారు. రష్యా చమురును దిగుమతి చేసుకోని ప్రతి కంపెనీ చెల్లిస్తున్న అదనపు ధర ఇది. సముద్ర మార్గంలో రష్యా చమురును దిగుమతి చేసుకోవటాన్ని యూరోపియన్ యూనియన్ నిషేధించినప్పటికీ రష్యాను ఉక్రెయిన్, బెలారస్, పోలెండ్, హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, జర్మనీ దేశాలతో కలిపే డ్రుజ్బా పైప్ లైన్ ద్వారా రష్యా చమురును దిగుమతి చేసుకోవటాన్ని ఇప్పటివరకూ మినహాయించింది.
రష్యా చమురును యురోపియన్ యూనియన్ దేశాల్లో నిషేధించాలనే నిర్ణయాన్ని పోలెండ్ గట్టిగా సమర్థించింది. అయినప్పటికీ పోలెండ్ రష్యా చమురును డ్రుజ్బా పైప్ లైన్ ద్వారా దిగమతి చేసుకుంది. చమురు దిగుమతికి చేయవలసిన చెల్లింపులను పోలెండ్ నిలిపివేసినందున రష్యా చమురును ఎగుమతి చేయటాన్ని ఆపింది. అయినప్పటికీ చెక్ రిపబ్లిక్‌లోని తన చమురు శుద్ది కర్మాగారంలో పోలెండ్ రష్యా చమురును శుద్ది చేస్తోంది. మరోవైపు జర్మనీ కజఖ్ చమురును రష్యా యాజమాన్యంలోని డ్రుజ్బా పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవటాన్ని పోలెండ్ తప్పుపడుతోంది. రష్యాపై ఎన్ని ఆంక్షలను విధించినా ఐరోపా దేశాలు మధ్యవర్తుల ద్వారా రష్యా చమురును దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి.