Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవాస టర్కీయుల ఓటింగ్ ప్రారంభం
అంకారా : టర్కీ జాతీయ ఎన్నికల్లో విదేశాల్లో నివసిస్తున్న లక్షలాదిమంది టర్కీష్ జాతీయులు ఓటు వేస్తున్నారు. దేశశ్యాప్తంగా ఏర్పాటుచేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో మే 9 వరకు వీరు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. టర్కీలో మాత్రం మే 14వరకు ఓటింగ్ జరగదు. అధ్యక్షుడు రెసెప్ తైయీప్ ఎర్డోగన్‌కు మరోసారి అధికార పగ్గాలు అందిస్తారో లేదో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ఎర్డోగన్ ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరోగ్యం బాగుండకపోవడంతో బుధ, గురువారాల్లో పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. కాగా, ఓటింగ్ ముందు 110మంది కుర్దిష్ అనుకూల అనుమానితులను టర్కీ అదుపులోకి తీసుకుంది. విదేశాల్లో వున్న టర్కీ జాతీయుల్లో అత్యధికంగా జర్మనీలో 15లక్షల మంది వున్నారు. గత ఎన్నికల్లో జర్మనీలోని మెజారిటీ టర్కిష్ ఓటర్లు ఎర్డోగన్‌కు మద్దతిచ్చారు. ఈసారి ఎన్నికల్లో కూడా అదే రీతిలో మద్దతు లభిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా, ఎర్డోగన్ ప్రధాన ప్రత్యర్ధి, సెంటర్ లెఫ్ట్ ప్రతిపక్ష పార్టీ నేత కెమల్ ప్రస్తుతం స్వల్ప ఆధిక్యతలో వున్నట్లు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. ఇటీవలి కాలంలో ఎర్డోగన్ నిరంకుశ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టర్కీలో కుటుంబ మూలాలు వున్న జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఒజ్డెమిర్ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో కెమల్ గెలుపొందితే టర్కీలో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంటుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.