Authorization
Mon May 05, 2025 02:46:03 pm
లండన్: బ్రిటన్లో మరణం లేని రోజుగా ఈ సోమవారం నమోదు అయింది. గతంలో మార్చి నెలలో ఒక రోజు మరణాలు లేని రోజుగా ప్రకటించబడింది. ఇది ఆ దేశం సంతోషించాల్సిన రోజు. మహమ్మారి వలన జరిగిన మరణాలు బ్రిటన్లో 1,27,282 ఉన్నాయి. బ్రిటన్ ప్రపంచం మరణాలలో 5వ స్థానంలో ఉన్నది. మరణాలు లేక పోవడం అంటే వ్యాక్సిన్ బాగా పని చేస్తున్నాయని బ్రిటన్ ఆరోగ్య మంత్రి అభిప్రాయ పడ్డాడు. అక్కడ కొత్త కేసులు నమోదు వేగం కూడా బాగా తగ్గిందని ఈ పరిస్థితికి సంతృప్తి చెందితే సరి పోదని భౌతిక దూరం పాటించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించి పరిస్థితిని అదుపు చేయాలని కోరారు. బ్రిటన్ జూన్ 21 నుంచి లాక్డౌన్ ఎత్తి వేయాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఈ లోపు దేశం నలుమూలల నుంచి సమాచారం సేకరించి, విశ్లేషించి జూన్ 14న తుది నిర్ణయం ప్రకటించబడుతుంది. భారత్లో ఉన్న వైరస్ నమోనా ప్రస్తుతం బ్రిటన్ను కలవర పెడుతున్నది దానిపై కూడా అధ్యయనం జరుపుతున్నారు.
-