Authorization
Sun May 04, 2025 06:00:57 am
బోగోటా: కొలంబియాలో అధ్యక్షుడు డ్యూక్ నిరసనకారులపై పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నారు. మొబైల్ అంటీ రాయిట్ స్కాడ్స్ని రంగంలోకి దింపి ప్రజలపై క్రూర హింసకు పాల్పడుతున్నారు. దీంతో నిరసన కారులు బోగోటా నగరాన్ని స్వాధీనం చేసుకుని అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్షుడు డ్యూక్ చర్చలలో కుది రిన ఒప్పందంపై సంతకం పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు. డ్యూక్ దేశంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్య, విద్య, వైద్యంలోని లోటుb ాట్లను సామాజిక భద్రతా చర్యలను మెరుగుపర్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సమస్యలు తీవ్రం కావడంతో ప్రజలు పోరాట మార్గం పట్టారు