Authorization
Sun May 04, 2025 01:21:17 am
న్యూయార్క్ : తన అంగారక మిషన్లో భాగంగా చైనా రోదసీ సంస్థ విడుదల చేసిన హై రిజల్యూషన్ చిత్రాల్లో రాళ్లతో, ఎర్రగా, చదునుగా వున్న అంగారక గ్రహం ఉపరితలాన్ని చూడవచ్చు. ల్యాండింగ్ ప్లాట్ఫారం (కుడి) నుండి 10మీటర్ల దూరంలో కెమెరా వుంచి జురాంగ్ రోవర్ (ఎడమ) తీసిన ఫోటో ఇది. ఆ తర్వాత కొద్దిగా వెనక్కి వెళ్లి గ్రూపు చిత్రం తీసింది. వైర్లెస్ సంకేతాల ద్వారా ఈ చిత్రాలను కెమెరా నుండి రోవర్కు పంపింది. గత నెలలో అంగారక గ్రహం ఉపరితలంపై రోవర్ దిగిన సంగతి తెలిసిందే.