Authorization
Sun May 04, 2025 02:58:22 pm
మయన్మార్: మయన్మార్ లో సూకీ పుట్టిన రోజు సందర్భంగా ప్రజలు నెత్తికి (సూకీ జడ రూపంలో) పూలు పెట్టుకుని తమ నిరసన తెలిపారు. సూకీ ఫిబ్రవరి నుంచి గృహ నిర్భందంలో ఉన్నారు. వారం రోజుల నుంచి ఆమెపై న్యాయవిచారణ జరుగుతున్నది ఎన్నికల సమయంలో లాక్డౌన్ నిబంధనలు పాటించ లేదని, చట్ట విరుద్ధంగా వాకీ టాకీలు కల్గి ఉన్నారని తప్పుడు ఆరోపణలపై విచారణ జరుగుతున్నది. తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రజలందరికీ తన న్యాయవాదుల ద్వారా సుకీ ధన్యవాదాలు తెలియజేశారు.