Authorization
Sun May 04, 2025 01:41:01 pm
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ కార్మిక ఉద్యమ నేత రిచర్డ్ ట్రుంకా (72) మృతిచెందారు. యూఎస్‌లోని ప్రముఖ ట్రేడ్ యూనియన్ల ఫెడరేషన్ అయిన 'అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ కాంగ్రెస్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఆర్గనైజేషన్స్ (ఎఎఫ్ఎల్-సీఐఓ)' అధ్యక్షుడిగా ఆయన దీర్ఘకాలం పనిచేశారు. ఈ ఫెడరేషన్లో దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. ఈయన 19వ ఏటనే బొగ్గుగని కార్మికుడిగా చేరారు. అనంతరం బొగ్గు గని కార్మికులను ఐక్యపర్చడంలో కీలక పాత్ర వహించారు. 2009లో ఆయన ఎఎఫ్ఎల్-సీఐఓకి అధ్యక్షుడయ్యారు.39 సంవత్సరాల వయస్సులో వర్జీనియాలోని బొగ్గు గని కార్మికుల 15 నెలల సమ్మె పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. ఈ పోరాటంతో కార్మికులకు ఆరోగ్య భద్రత, పెన్షన్ హక్కుల రక్షణలో విజయం సాధించారు. సమ్మెకాలంలో విధుల నుంచి తొలగించిన 4000 మంది కార్మికులకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చేవరకు పోరాడి పునర్ నియామకం జరిగేందుకు కృషిచేశారు. ట్రుంకా మృతికి అమెరికా అధ్యక్షుడు బైడెన్, హిల్లరీ క్లింటన్, అనేక కార్మిక సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు.