Authorization
Mon May 05, 2025 05:16:25 am
- పాక్ హోంమంత్రి వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : తాలిబన్ వశమైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న సంఘటనల పట్ల భారత్ చాలా అసౌకర్యంగా వుందన్న విషయం స్పష్టమవుతోందని పాకిస్తాన్ హోంమంత్రి షేక్ రషీద్ బుధవారం వ్యాఖ్యానించారు. భారత్ ఎలా వుందో యావత్ ప్రపంచం వీక్షిస్తోందన్నారు. ఇస్లామాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ పౌరులను తరలించే తీరు చూస్తుంటే వారి ఓటమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 'ఓటమి అనేది వారి ముఖాలపై కనిపిస్తోంది.' అని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అస్తవ్యస్థ పరిస్థితులకు ఏళ్ళ తరబడి పాకిస్తాన్ మూల్యం చెల్లిస్తోందని అన్నారు. అక్కడ తిరిగి శాంతి నెలకొనాలని పాక్ గట్టిగా కోరుకుంటోందని చెప్పారు.