Authorization
Sun May 04, 2025 02:58:37 am
ఢాకా: బంగాదేశ్లో పౌరులు ప్రయాణించే పడవ, సరుకుల రవాణా ఓడను ఢ కొట్టడంతో 21 మంది చనిపోయారు. ఈ సంఘటన బీజరునగర్ వద్ద తూర్పు బంగ్లాదేశ్లో జరిగింది. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 100 మంది ప్రమాణీకులు ఉన్నట్టు తెలుస్తున్నది. సరుకుల రవాణా ఓడ ఇసుక రవాణా చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గజ ఈతగాళ్ళు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం శుక్రవారం నాడు జరిగింది.