Authorization
Sun May 04, 2025 05:07:57 am
- గత ఏడాది కంటే 30 శాతం పెరుగుదల
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కంటే 30 శాతం తుపాకీ దాడులు పెరిగినట్లు ఒక అధ్యయనం తెలిపింది. కరోనా మహమ్మారి కాలంలో ఈ విధంగా జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న మార్చి 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకూ 13 నెలల కాలంలో అమెరికా వ్యాప్తంగా 51,000 దాడులు జరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే 13 నెలల వ్యవధిలో 39,000 దాడులు జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగానే ఏర్పడిన మానసిక, ఆర్థిక ఒత్తిళ్లు, ఆయుధాల అమ్మకాలు పెరగడం.. ఈ దాడులు పెరగడానికి కారణాలుగా పరిశోధకులు తెలిపారు. స్టే ఎట్ హోమ్, భౌతిక ధూరం వంటి నిబంధనల కారణంగా ఏర్పడిన 'అనుకోని సామాజిక, ఆర్థిక ఒత్తిళ్లు' గురించి అధికారులు తెలుసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు.