Authorization
Thu April 24, 2025 05:17:19 pm
హవానా: క్యూబా విప్లవ నేత ఫైడల్ కాస్ట్రో మరణించి ఐదు సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆయన స్మృత్యర్ధం హవానాలో కాస్ట్రో స్టడీ సెంటర్ను ప్రారంభించారు. కాస్ట్రో ఆలోచనలు, ఆయన చేసిన కృషి, భావజాలాన్ని అధ్యయనం చేయడానికి, ప్రచారం చేయడానికి ఉద్దేశించి గురువారం ఫిడెల్ కాస్ట్రో రజ్ కేంద్రాన్ని ఆరంభించినట్టు క్యూబా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కాస్ట్రో మరణించిన తర్వాత ఆయన పేరును బహిరంగ ప్రాంతాలకు, కట్టడాలకు ఉపయోగించుకోవడాన్ని క్యూబన్ పార్లమెంట్ నిషేధించింది. ఆయన తన జీవితంలో చేసిన కృషిని భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు మినహాయింపు ఇచ్చినట్టు క్యూబా కమ్యూనిస్టు పార్టీ తెలిపింది.