Authorization
Wed April 23, 2025 08:53:10 pm
- ప్రమాదకర వేరియంట్‌గా మారే అవకాశం : డబ్ల్యుహెచ్ఒ హెచ్చరిక
స్టాక్‌హామ్ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు సరికొత్త ప్రమాదాన్ని పెంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యుహెచ్ఒ) వెల్లడించింది. మరింత ప్రమాదకర వేరియంట్ వెలుగుచూడవచ్చని మంగళవారం హెచ్చరించింది. కేసుల పెరుగుదల భవిష్యత్‌లో ప్రమాదకర వేరియంట్‌గా పరిణమించవచ్చని హెచ్చరిస్తోందని డబ్ల్యుహెచ్ఒ సీనియర్ ఎమర్జెన్సీస్ ఆఫీసర్ కేథరీన్ స్మాల్‌వుడ్ అన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ.. ప్రజల్లో అధకంగా వైరస్‌ని విస్తరింపచేస్తుందని, దీంతో మరోకొత్త వేరియంట్ ఉత్పన్నంకావచ్చని, .. మరణాలకు దారితీయవచ్చని అన్నారు. డెల్టా కంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. అనంతరం వచ్చే వేరియంట్ తీవ్రత ఎలా ఉంటుందో ఎవరూ ఊహంచలేరని అన్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటినుండి యూరప్‌లో పది కోట్ల కేసులు నమోదవగా.. గతేడాది చివరి వారం నుండి 50 లక్షలకుపైగా కేసులు వచ్చాయని .. గతంలో కన్నా తీవ్రమైన పరిస్థితులు రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం మనమిప్పుడు అత్యంత ప్రమాదకర దశలో ఉన్నామని, ఇన్ఫెక్షన్ రేటు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోందని, దీంతో ఒమిక్రాన్ ఉధతిని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేమని అన్నారు. డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఆస్పత్రుల్లో చేరే ప్రమాదం తక్కువ అని అన్నారు. మొత్తంగా ఒమిక్రాన్ కేసులతో ప్రమాదకర వేరియంట్ల ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.