Authorization
Mon April 14, 2025 12:18:24 pm
వాషింగ్టన్ : లాటిన్ అమెరికాలో రష్యా తన బలగాలను మోహరిస్తే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని వైట్‌హౌస్ గురువారం పేర్కొంది. వెనిజులా లేదా క్యూబాల్లో రష్యా తన బలగాలను మోహరించగలదన్న సూచనలు వస్తున్న నేపథ్యంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అమెరికా పై రీతిలో స్పందించింది. ఈ విషయం ఇటీవల జెనీవాలో జరిగిన వ్యూహాత్మక చర్చల్లో ప్రస్తావనకు రాలేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ తెలిపారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గి రిబ్కోవ్ ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే లాటిన్ అమెరికాకు రష్యా బలగాలను పంపవచ్చనే సూచనలు చేశారు.బలగాల మోహరింపు గురించి జర్నలిస్టు ప్రశ్నించగా రిబ్కోవ్ నిర్ధారించనూ లేదు,ఖండించనూ లేదు.విదేశీ,మిలటరీ విధానానికి చాలా ఎంపికలు వుండడం అమెరికన్ స్టైల్ అని ఆయన వ్యాఖ్యానించారు.'రష్యాపై కవ్వింపు చర్యలకు దిగితే, అమెరికా మాపై సైనిక ఒత్తిడి పెంచితే ఎలాంటి చర్యలు వుండవచ్చనే దానిపై రష్యా అధ్యక్షు డు ఇప్పటికి చాలాసార్లు మాట్లాడారు.మేం దాన్ని కోరుకోవడం లేదు.దౌత్యవేత్తలు ఒక అంగీకారానికి రావాలి.''అని రిబ్కోవ్ పేర్కొన్నారు.