Authorization
Mon April 14, 2025 12:38:32 pm
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్, జీ జిన్‌పింగ్ శుక్రవారం చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 'ఇరుదేశాల మధ్య అంశాలతో పాటు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పరస్పర ఆందోళన కలిగించే ఇతర అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు' అని తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి చేయడంపై గురించి రష్యాను ఖండించడానికి చైనా నిరాకరిస్తోంది, పైగా ఇలాంటి తీవ్ర ఉద్రిక్తతలకు అమెరికా, నాటో యొక్క విస్తరణ కాంక్షలే కారణమని చైనా ఆరోపిస్తోంది. ఇలాంటి నేపధ్యంలో బైడెన్, జిన్‌పింగ్ చర్చలు విశేషంగా మారాయి.