Authorization
Fri April 11, 2025 08:37:16 am
ఖాట్మండు : ఎన్నాళ్ళగానో వేచి చూస్తున్న పంచేశ్వర్ బహుళపక్ష ప్రాజెక్టుతో పాటు జలవనరులకు సంబంధించిన ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు భారత్, నేపాల్ ఉన్నతాధికారులు బుధవారం సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. జల వనరులపై జాయింట్ కమిషన్ కార్యదర్శి (జెసిడబ్ల్యుఆర్) స్థాయిలో ఈ చర్చలు జరుగుతున్నాయి. మొదటి రెండు రోజులు పంచేశ్వర్ బహుళపక్ష ప్రాజెక్టులోని వివిధ అంశాలపై సంయుక్త సారధ్య సంఘం (జెఎస్సి)లో చర్చ జరుగుతుంది.