Authorization
Thu April 10, 2025 04:15:10 pm
బీజింగ్ : ఈశాన్య చైనాలో చాంగ్చుమ్ నగరంలోని ఒక రెస్టారెంట్లో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో మంటలు తలెత్తాయని వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేయడానికి చర్యలు తీసుకున్నాయని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం తెల్లవారు జామున 3 గంటల కల్లా మంటలు అదుపులోకి వచ్చాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మంటలు తలెత్తడానికి గల కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నెల ప్రారంభంలో సెంట్రల్ నగరమైన చాంగ్షాలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆకాశహర్మ్యంలో ఒక భాగం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ సంఘటనలో ఎవరూ మరణించలేదు. గతేడాది జులైలో ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 15మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు.