Authorization
Mon April 07, 2025 04:12:08 am
- అమెరికా ఆంక్షలతో నిలిచిన మానవతా సాయం
మెక్సికో : వెనిజులా ప్రభుత్వం పాలనలో ప్రజాస్వామ్య విధానాలకు పెద్దపీట వేస్తోంది. ప్రజల సంక్షేమ చర్యలకు సంబంధించి ప్రతిపక్షంతో కలిసి ప్రత్యేక ఒప్పందంపై సంతకాలు చేసింది. అమెరికా ఆంక్షల కారణంగా ప్రజారోగ్యం, విద్య, విద్యుత్ వంటి కీలక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఆంక్షల వల్ల వివిధ దేశాల్లో వెనిజులా మానవతా సహాయానికి సంబంధించిన ఖాతాలు ఎక్కడికక్కడే స్థభించిపోయాయి. ఈ నేపథ్యంలో ఖాతాలను పునరుద్ధరించి మానవతా సాయాన్ని ఖర్చు చేయడం ద్వారా విద్య, వైద్య, విద్యుత్ రంగాలకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రభుత్వం ప్రజాస్వామ్య మార్గాలను అనుసరిస్తోంది.