Authorization
Mon April 07, 2025 05:04:23 am
పారిస్: వివాదాస్పదమైన పెన్షన్ సంస్కరణ బిల్లుని వెనక్కి తీసుకోవాంటూ అధ్యక్షుడు మాక్రాన్‌ను ప్రజలు కోరుతున్నారు. ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలంటూ మంగళవారం సుమారు 2.8 మిలియన్లకు పైగా కార్మికులు ఆందోళన చేపట్టారు. పలు యూనియన్లు, వామపక్ష సంస్థల ఆధ్వర్యంలో రవాణా, విద్య, ఇంధన రంగాలకు చెందిన కార్మికులు ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టారు. మరో వైపు ఈ బిల్లుపై మంగళవారం జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుని ఉపసంహరించాలంటూ గత నెల నుండి లక్షలాది మంది కార్మికులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తనకు ప్రస్తుతం 60 ఏళ్లని, మరో రెండేళ్లలో పదవీ విరమణ పొందాల్సి వుంది. అయితే నూతన బిల్లు ఆమోదం పొందితే తాను మరో రెండేళ్ల పాటు పదవి విరమణ కోసం వేచి చూడాల్సివుందని, ముఖ్యంగా మహిళలకు ఇది చట్టవిరుద్ధమైనదని పారిస్ వీధుల్లో నిరసన తెలిపిన గ్రాఫిక్ డిజైనర్ అన్నే పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వెనక్కి తగ్గే వరకు నిరసన చేపడతామని ఫ్రెంచ్ డెమోక్రటిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లేబర్ తెలిపింది. నూతన బిల్లు ఆమోదం పొందితే.. పదవీ విరమణ అనంతరం ఓ కార్మికుడు పూర్తి పెన్షన్ పొందాలంటే 43 ఏళ్ల పాటు యాజమాన్యం నగదు చెల్లింపులు చేయాల్సి వుంటుందని పేర్కొంది.