Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మధ్యప్రాచ్యంలో అడుగంటుతున్న అమెరికా ఆధిపత్యం! | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Apr 17,2023

మధ్యప్రాచ్యంలో అడుగంటుతున్న అమెరికా ఆధిపత్యం!

వాషింగ్టన్‌ : పశ్చమ ఆసియాలోని ఉపప్రాంతం పేరే మధ్యప్రాచ్యం. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండాలు కలిసే వ్యూహాత్మక ప్రాంతమే మధ్యప్రాచ్యం. భౌగోళిక-రాజకీయ ఆధిపత్యం కోసం చరిత్రలో ఈ ప్రాంతంలో ఈజిప్షియన్లు, గ్రీకులు, పర్షియన్లు, రోమన్లు, అరబ్బులు, టర్కులు, బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, అమెరికన్లు, రష్యన్లవంటి అనేక జాతుల మధ్య ఎన్నో పోరాటాలు జరిగాయి. అలాగే పరస్పరం కత్తులు దూసుకునే మూడు మతాలకు (క్రైస్తవం, జుదాయిజం లేక యూదు మతం, ఇస్లాం) మధ్యప్రాచ్యమే జన్మస్థలం.
ఈ మధ్యకాలందాకా అప్రతిహత ఆధిపత్యాన్ని చెలాయించిన అమెరికా ఈ ప్రాంతంపై వేగంగా తన పట్టును కోల్పోతోంది. మధ్యప్రాచ్యంలో ప్రధాన పాత్రధారులందరికీ అమెరికా దూరమైంది. ఈ ప్రాంతంలో దాదాపు అన్ని దేశాలూ అమెరికాను ఆనందపరచటానికి నిర్ణయాలు తీసుకోవటం మానేశాయి. టర్కీలో అమెరికా పలుకుబడి నామమాత్రం అయింది. ఇరాన్‌తో అమెరికా శత్రుత్వం పెంచుకుంది. సౌదీ అరేబియాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాలస్తీనాతో అమెరికాకు ఎటువంటి సంబంధమూ లేదు. రష్యా, చైనాలతో సంబంధాల విషయంలో వచ్చిన తేడావల్ల అమెరికాకు ఇజ్రాయిల్‌తో కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఈజిప్టుకు అమెరికా అంటే అంత గౌరవం లేదు. తన ప్రయోజనాలను తాను చూసుకుంటూ పక్కా వ్యాపార దేశంగా మారిపోయిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అమెరికాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటోంది.
అమెరికా మాత్రమే ఈ ప్రాంతంపైన తన పట్టును కోల్పోలేదు. ఒకప్పుడు ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని చెలాయించిన గత కాలపు సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కూడా తమ పలుకుబడిని కోల్పోయాయి.
ఈ కాలక్రమంలో ఇరాన్‌తో అమెరికా శత్రుత్వం పెంచుకుంది. ప్రచ్చన్న యుద్ధానంతర కాలంలో ఇరాక్‌, సిరియాలలో అమెరికా అనేక వ్యూహాత్మక తప్పిదాలను చేసింది. పర్యవసానంగా వివిధ మధ్యప్రాచ్య దేశాలలో ఇరాన్‌ పలుకుబడి పెరిగి ఇరాన్‌ అనుకూల శక్తులవల్ల ఇజ్రాయిల్‌, ఇతర గల్ప్‌ దేశాలలో అభద్రతాభావం ఏర్పడింది. ఈ అభద్రతవల్లే ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇరాన్‌ను తన సైనిక శక్తితో అమెరికా భయపెడుతున్నప్పటికీ గల్ప్‌ ప్రాంతంలో ఇరాన్‌ పలుకుబడిని తగ్గించలేకపోయింది.
ఈమధ్య కాలంలో అమెరికా-సౌదీ అరేబియా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇస్లాం వ్యతిరేకత, సౌదీ అరేబియా టెర్రరిస్టుల స్థావరం అనే అపోహ అమెరికాకు ఉండటంవల్ల ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అత్యంత కరడుగట్టిన ఇస్లామిక్‌ సమాజంగావున్న సౌదీలో ఎమ్‌ బి ఎస్‌ గా పిలవబడుతున్న రాకుమారుడు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పెద్ద ఎత్తున్న సంస్కరణలను ప్రవేశపెట్టాడు. తత్ఫలితంగా సౌదీలో వేగంగా సామాజిక ఉదారీకరణ జరుగుతోంది. అయినప్పటికీ అమెరికాలోవున్న సామాజిక విలువలకు, సౌదీ సమాజానికి మధ్య తేడా పూడ్చనలవికానంతగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అవలంబిస్తున్న ''అమెరికా ఫస్ట్‌'' విధానంవల్ల సౌదీతో సహా ఇతర దేశాలలో కూడా జాతీయ ప్రయోజనాలతో రాజీపడకూడదనే భావన ఏర్పడింది. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తమ డెమోక్రాటిక్‌ పార్టీ గెలుపుకు అనుకూలంగా ఉంటుందని చమురు ధరను తగ్గించటానికి చమురు ఉత్పత్తి స్థాయిని పెంచాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కోరినప్పుడు సౌదీ అరేబియా సానుకూలంగా స్పందించలేదు. అలాగే తన ప్రత్యర్థులైన చైనా, రష్యాలకు వ్యతిరేకంగా అమెరికా సౌదీ మద్దతు కోరినప్పుడు కూడా సౌదీ అంగీకరించలేదు. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధం తప్పైనప్పటికీ అది నాటో విస్తరణవల్ల, అమెరికా జోక్యంవల్ల జరుగుతోందని సౌదీ అరేబియా భావిస్తోంది. ఈ సందర్బంగా లెబనాన్‌, సిరియాలలో ఇజ్రాయిల్‌ దాడులు, ఇరాక్‌పైన అమెరికా చేసిన ఘోరమైన యుద్ధం, లిబియాలో నాటో జోక్యం, సిరియాలో అమెరికా రహస్య కార్యకలాపాలు సౌదీ అరేబియా గుర్తుచేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఆచరణకు భిన్నంగా చైనా వ్యవహరిస్తోంది. చైనా చమురు దిగుమతుల్లో మూడవ వంతు జీసీసీ దేశాల నుంచే వస్తోంది. అన్నింటికంటే ఎక్కువగా సౌదీ అరేబియా నుంచే చైనా చమురును దిగుమతి చేసుకుంటోంది. బీసీసీ దేశాల చమురు ఎగుమతుల్లో 6వ వంతు, ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో 5వ వంతు, ఇరాక్‌ చమురు ఎగుమతుల్లో సగం వరకు చైనా దిగుమతి చేసుకుంటూ ఈ ప్రాంతంలో ప్రముఖ వ్యాపార భాగస్వామిగాను, పెట్టుబడిదారుగాను చైనా ఎదిగింది. పర్యవసానంగా మధ్యప్రాచ్య దేశాలు చైనాతో సంపర్కాన్ని మరింతగా కోరుకుంటున్నాయి. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో 17 అరబ్‌ దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా పెట్టిన ఆక్షలవల్ల ఇరాన్‌ ముందుగా చైనావైపు, ఆ తరువాత రష్యావైపు మొగ్గింది.
సౌదీ అరేబియాతో సహా మధ్యప్రాచ్య దేశాలలో చాలావరకు అమెరికాపైన అతిగా ఆధారపడకూడదనే భావనకు వచ్చాయి. అందువల్ల అవి చైనా, రష్యా, ఇండియావంటి దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలలో తమ ప్రయోజనాలకు భిన్నంగా అమెరికాకు కొమ్ముకాయటం మానుకున్నాయి. అమెరికావలే చైనా ఈ ప్రాంతంలోని దేశాల రాజకీయ వ్యవస్థలను, సామాజిక విలువలను మార్చుకోమని కోరటం లేదు. చైనా ఈ దేశాలను, నాయకులను అవమానించటం లేదు. ఇలా చైనా వాణిజ్యం, పెట్టుబడుల మీద ద్రుష్టిని సారించి పశ్చిమాసియాలోని రాజకీయ తగాదాల జోలికి పోకపోవటంవల్ల ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్ట్‌, సిరియా, జోర్డాన్‌, సిరియాలతోసహా అన్ని మధ్యప్రాచ్య దేశాలతో చైనాకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకవైపు చైనా వివిధ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపడేలా చేస్తుంటే మరోవైపు అమెరికా మధ్యప్రాచ్యంలో చైనా పలుకుబడిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఆవిధంగా లోపభూయిష్టమైన అమెరికా విధానాలవల్ల మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యం బలహీనపడి చైనా, రష్యాల ప్రాబల్యం వేగంగా పెరుగుతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉక్రెయిన్‌కు అమెరికా మిస్సైల్‌ రక్షణ వ్యవస్థ
అరబ్‌ లీగ్‌లో సిరియా చేరితే కలవరపడేది అమెరికానే : చైనా
ఆ ఘర్షణలు బీజేపీ కుట్రే
గ్రీస్‌ వర్సిటీ ఎన్నికల్లో కమ్యూనిస్టు మద్దతుదారుల జయభేరి
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఫ్రెంచ్‌ ప్రభుత్వం
అమెరికా ఆజ్యంతో మండుతున్న ఉక్రెయిన్‌ రావణ కాష్టం!
రష్యా చమురు దిగుమతిపై ఆంక్షలు
ఇమ్రాన్‌ అరెస్టు అక్రమం
సిరియాను తిరిగి చేర్చుకున్న అరబ్‌ లీగ్‌
భారత్‌లో మాతా శిశు మరణాలు ఎక్కువే
ట్రంప్‌ దోషే...
ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్‌
రక్తపాతాలు, కుట్రలను పురిగొల్పేది పెత్తందారీ శక్తులే !
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు
బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కి పట్టాభిషేకం
సెర్బియాలో మూకుమ్మడి హత్యలు
ఇంగ్లండ్‌ స్థానిక ఎన్నికల్లో పేలవమైన పనితీరును కనబరిచిన టోరీలు ముందంజలో లేబర్‌ పార్టీ, లిబరల్‌ డెమోక్రాట్లు
ముగ్గురు పాలస్తీనియన్లను హతమార్చిన ఇజ్రాయిల్‌ మిలటరీ
పాక్‌లో స్కూలును చుట్టుముట్టిన సాయుధులు
పుతిన్‌పై హత్యాయత్నం ?
ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా
జూన్‌ 1కల్లా రుణాల చెల్లింపు సంక్షోభంలో అమెరికా !
చైనాతో ఆర్థిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్న మలేషియా
లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న చైనీస్‌ యువాన్‌
ప్రతి దాడి విఫలమైతే... ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల మద్దతును కోల్పోతుంది..!
భద్రతా మండలిని విస్తరించాలి : రష్యా విజ్ఞప్తి
ఉత్తర కొరియాను నిలువరించేందుకు అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణు ఒప్పందం
ఉక్రెయిన్‌కి నాటో సైనిక సహాయం
టర్కీ సార్వత్రిక ఎన్నికలు
ప్రధాని మోడీ..విషపూరితమైన పాము !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.