Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాజా : ఆక్రమిత భూభాగం కోసం ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై గత కొన్నేళ్లుగా దాడులు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఎంతోమంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరెంతోమంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ జైళ్లలో ఐదు వేల మంది పాలస్తీనియన్లు ఖైదీలుగా ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఫిబ్రవరి 17వ తేదీ పాలస్తీనా ఖైదీల దినోత్సవం సందర్భంగా ఖైదీలు, మాజీ ఖైదీల వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన పాలస్తీనా కమిషన్, పాలస్తీనియన్ ఖైదీల సంఘం, ఖైదీల మద్దతు.. మానవ హక్కుల కోసం ఏర్పాటు చేసిన అడ్డమీర్ అసోసియేషన్, పాలస్తీనియన్ సమాచార కేంద్రం వాడి హిల్వే సంయుక్తంగా వెల్లడించిన నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ అధికారికంగా సుమారు 4,900 మంది పాలస్తీనియన్లను ఖైధీలుగా బంధించింది. వారిలో 31 మంది మహిళలు, 160 మంది మైనర్లు, 1000 మంది ఎక్కువ మందిని ఎలాంటి అభియోగం లేకుండా నిర్బంధంలో ఉన్నారని ఆ నివేదిక బహిర్గతం చేసింది.