Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాల్లోనే పేలిన అతిపెద్ద రాకెట్ స్టార్ షిప్
వాషింగ్టన్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ 'స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైంది. అమెరికా దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ము కుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్.. కొద్దిసేపటికే పేలి పోయింది. టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్).. నిర్ణీత సమయం (3 నిమిషాలు)లోగా విడి పోవాలి. కానీ, అంతకుముందే పేలి పోయింది. ఈ ప్రయోగ ఫలితాలను తమ శాస్త్రవేత్తలు సమీక్షిస్తారని 'స్పేస్ఎక్స్' వెల్లడించింది. నేటి వైఫల్యం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని.. సిబ్బందిని అభినందిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.