Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు నరసింహారావు
అరబ్ దేశమైన యెమెన్ ఎనిమిదిన్నరేండ్ల అంతర్యుద్ధంలో కకావికలయింది. 2014లో మొదలైన ఈ అంతర్యుద్ధం కారణంగా కనీసం 3.5 లక్షలమంది చనిపోయారు. వీరిలో 85వేల మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు. వీరు ఆహారం అందక చనిపోయారు. మౌలిక పౌర సదుపాయాలు, ప్రజా పంపిణీ సరఫరా చైన్లు పతనమయ్యాయి. కలరా వంటి అంటువ్యాదులతో ప్రజలు లెక్కకు మించి చనిపోయారు. ఈ అంతర్యుద్ధం ప్రధానంగా యెమెనీ ప్రభుత్వానికి, హౌతీ సాయుధ ఉద్యమానికి మధ్య జరుగుతోంది. 2022లో అబ్ద్రాబ్బు మన్సూర్ హది నుంచి రషద్ అల్ అలీమీకి అధికారం బదిలీ అయింది. 2015 నుంచి మొదట హదీకి, ఆ తరువాత అలీమీకి సౌదీ అరేబియా మద్దతు ఇవ్వటంతో యెమెనీ అంతర్యుద్ధం తీవ్రతరమైంది. అంతిమంగా ఈ యుద్ధం సౌదీ అరేబియా, ఇరాన్ అనుకూల శక్తుల పోరుగా పరిణమించింది.
ప్రస్తుతం ఈ అంతర్యుద్ధం పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణపై ఇరుపక్షాలకు ఒక అవగాహన వచ్చిందని ఏప్రిల్ 6వ తేదీనాడు అమెరికా మీడియా పేర్కొంది. యెమెన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని నిలిపి వేయాలని సౌదీ అరేబియా యెమెన్ ప్రభుత్వానికి తెలియజేసిందని, సౌదీ ప్రభుత్వం ''శాశ్వత కాల్పుల విరమణ'' కోసం ఒక ప్రతినిధి వర్గాన్ని యెమెన్ కు పంపిందని, ఏప్రిల్ 14వ తేదీకల్లా దీనికి సంబంధించిన చర్చలు ముగిశాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య రాజీ కుదిరి దౌత్యసంబంధాలు పునరుద్దరించబడటంవల్లనే యెమెన్, సిరియాలలో జరుగుతున్న అంతర్యుద్ధా లకు ముగింపు పలికే అవకాశం ఏర్పడింది. అన్నింట ికంటే ముఖ్యంగా అర్థం కావలసిందేమిటంటే యెమెన్‌లో జరుగుతున్న అతర్యుద్ధాన్ని పరిష్కరిస్తా నన్న అమెరికా అధ్యక్షుడు ఆపని చెయ్యలేదు. కానీ చైనా దౌత్యంతో మాత్రమే ఈ అంతర్యుద్ధానికి పరిష్కారం లభించబోతోంది. అమెరికన్ మీడియా, ఇంటర్సెప్ట్ వంటి స్వతంత్ర వార్తా సంస్థలు చైనా దౌత్యవిజయం వల్లనే లక్షలాది ప్రజల మరణాలకు దారితీసిన యెమెన్ అంతర్యుద్ధం నిలిచిపోనున్నదని కథనాలను ప్రసారం చేశాయి.
ఈ మానవ హననాన్ని ఒక దశాబ్దంపాటు పశ్చిమ దేశాల మీడియా పట్టించుకోలేదు. మధ్య ప్రాచ్య దేశాలతో సంబంధాలు, అనుబంధాలు లోతు గా వున్న అమెరికా ఎన్నడూ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలను ఆపటానికి ప్రయత్నం చెయ్యకపోగా వాటిని మరింతగా తీవ్రతరం చేసింది. సౌదీ అరేబియా తన ప్రాంతీయ ప్రత్యర్థి దేశాలతో రాజీపడటం తమను ''తీవ్ర నైరాస్యానికి'' గురిచేస్తోందని అమెరికా గూఢచార సంస్థ డైరెక్టర్ విలియం బర్న్స్ అన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా కలలో కూడా ఊహించని అనేక శాంతి ప్రతిపాదనలను అమెరికాకు ఏమాత్రం తెలపకుండా సౌదీ అరే బియా ఆమోదించటంతో అగ్రరాజ్య ఆగ్రహానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే అమెరికా నుంచి అత్యధిక విలువగల ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం సౌదీ అరేబియా. అమెరికాలోని మిలిటరీ-ఇండిస్టియల్ కాంప్లెక్స్ కి లాభాలు రావాలంటే యుద్ధాలు జరగాలి. శాంతి ఆయుధ వ్యాపారానికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి అమెరికా దౌత్యం శాంతికి వ్యతిరేక దిశలో సాగుతుంటుంది. అనేక దశాబ్దాలుగా మధ్యప్రాచ్య ప్రాంతంలోని దేశాల మధ్య జరిగుతున్న యుద్ధాల లో అమెరికా ప్రమేయం, పాత్రా ఉన్నాయి. అలా అలా దేశాలమధ్య ఘర్షణల ను రెచ్చగొట్టి, వాటిని యుద్ధాలకు దారితీసేలా చేసి తన ఆయుధ పరిశ్రమకు లాభాలను అమెరికా ఇబ్బడిముబ్బడిగా దోచిపెడుతోంది.
మరోవైపు చైనా ఈ దేశాలతో మరోలా వ్యవహ రిస్తోంది. నిజానికి చైనా ప్రపంచంలో నాలుగవ ప్రధాన ఆయుధ ఎగుమతిదారు. అయితే ప్రపంచ ఆయుధ వ్యాపారంలో అమెరికా వాటా 40 శాతం గా వుంటే చైనా వాటా 5.2 శాతంగా ఉంది. చైనా కంపెనీలు సరుకులను, సేవలను అమ్ముతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తాయి. చైనా కార్యకలా పాలు కొనసాగాలంటే అందుకు అనువైన రాజకీయ పర్యావరణం, స్థిరత్వం, క్రమత పాటించే విలువ లుగా ఉండాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా దాదాపు అమెరికాకు సమానం అవుతోంది. ప్రపంచంలో అత్యధికంగా చమురుని దిగుమతి చేసుకునే దేశంగా చైనా ఎదిగింది. అన్ని దేశాలకంటే ఎక్కువగా సౌదీ అరేబియా చైనాకు క్రూడ్ ఆయిల్ ని ఎగుమతి చేస్తోంది. 2021 లెక్కల ప్రకారం ఈ చమురు విలువ 38.3 బిలియన్ డాలర్లు. సౌదీ చమురు ఎగుమతుల్లో చైనా కు చేస్తున్న ఎగుమతి వాటా 27.8శాతం. అలాగే 2022 లెక్కల ప్రకారం ఇరాన్ విదేశీ వాణిజ్యంలో చైనా వాటా 30శాతంగా ఉంది. చైనాకు ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా వున్న సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు మధ్య ప్రాచ్యంలో ఘర్షించే శక్తులకు వెన్నుదన్నుగా ఉన్నా యి. ఈ రెండు దేశాలమధ్య సయోద్య ఏర్పడితే యావత్ మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటుంది. ఈ దిశగా చైనా చేసిన మధవర్తిత్వంతో సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య 2021నుంచి చర్చలు కొన సాగుతున్నాయి. 2023 మార్చి10వ తేదీనాడు చైనాలో ఐదు రోజులపాటు జరిగిన చర్చలు సఫలమై రెండు నెలల్లో ఇరు దేశాలమధ్య దౌత్య సంబంధా లను పునరుద్దరించుకోవాలనే నిర్ణయం జరిగింది. ఒకరి అతర్గత రాజకీయాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదని కూడా ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. దీనితో యెమెన్‌తో సహా యావత్ మధ్యప్రాచ్యంలోని దేశాల మధ్య శాంతి, సౌబ్రాత్రుత్వం వెల్లివిరిసే అవకాశం ఏర్పడింది.