Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైవాన్ చైనా హెచ్చరిక
షాంఘై : తైవాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తే వారు నిప్పుతో చెలగాటమాడినట్లేనని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హెచ్చరించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో, వర్ధమాన దేశాల ప్రయోజనాల్లో చైనా కృషి, వాటా గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేపట్టిన అంతర్జాతీయ భద్రతా చొరవను కిన్ పదే పదే ప్రశంసించారు. పశ్చిమ దేశాల ఉదారవాద దృక్పథానికి ప్రత్యామ్నాయంగా సామాజిక సుస్థిరత, ఆర్థిక వృద్ధికి దోహదపడే ఏక పార్టీ రాజకీయ వ్యవస్థ మారాలన్నదే చైనా అభిమతమన్నారు. దేశసార్వభౌమాధికారం,ప్రాదేశిక సమగ్రతలన పరిరక్షించడం అన్నింటికంటే కీలకమైనదని వ్యాఖ్యానించారు. చైనా కీలక ప్రయోజనాల్లో కీలకమైనది తైవాన్ సమస్య అని ఆయన పేర్కొన్నారు. చైనాను భద్రతను, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా తీసుకునే చర్యలను తామెన్నడూ సహించబోమని స్పష్టం చేశారు. తైవాన్ విషయంలో ఆటలాడాలనుకునేవారు నిప్పుతో నిలువెల్లా దగ్ధమవుతారని హెచ్చరించారు.