Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శత్రువుల శాపనార్థాల మధ్య అప్రతిహతంగా సాగుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Apr 22,2023

శత్రువుల శాపనార్థాల మధ్య అప్రతిహతంగా సాగుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ

నెల్లూరు నరసింహారావు
          చైనా స్థూల జాతీయోత్పత్తిపై ఈ వారంలో ప్రచురింపబడిన సమాచారం ప్రకారం చైనా ఆర్థిక వ్యవస్థ 2023 మొదటి త్రైమాసికంలో అందరి అంచనాలను అధిగమించి 4.5శాతం వృద్ధిని సాధించింది. రిటైల్‌ అమ్మకాల్లో 7.4 శాతం వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేస్తే అది 10.6శాతానికి పెరిగింది. చైనాను మూడు సంవత్సరాలపాటు కోవిడ్‌ కుంగదీసిన తరువాత సాధించిన ప్రగతి ఇది. ఈ వార్తను చూసిన తరువాత ఆర్థికవేత్తలు, బ్యాంకులు, సంస్థలు వర్తమాన సంవత్సరానికి మరింత ఆశాజనకమైన అంచనాలను చైనా సాధి స్తుందని భావిస్తున్నారు. కోవిడ్‌ని నియంత్రించటా నికి చైనా తీసుకున్న తీవ్ర చర్యలవల్ల కలిగిన దుష్పలితాల నుంచి తేరుకుని చైనా 6శాతాన్ని మించి వృద్ధిని సాధించే అవకాశముంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య చైనా ఆర్థిక వ్యవస్థ అన్ని అంచనాలనూ మించి ముందుకు దూసుకుపోతోంది. చైనా అద్భుతమైన వృద్ధికి, దాని ఉత్తానానికి, దాని భోగభాగ్యాలకు కాలం చెల్లిందని గత రెండు సంవత్సరాలుగా రాసిన వ్యాసాలు ఒక వెల్లువలా మీడియాను ముంచెత్తాయి. అమెరికన్‌ ఎంటర్ప్రైస్‌ ఇన్స్టిట్యూట్‌ అనే నయామితవాద థింక్‌ టాంక్‌ ''ముగిసిన చైనా అద్భుత ఆర్థిక ప్రగతి'' అనే వ్యాసాన్ని 2022 నవంబర్‌లో ప్రచురించింది. ఇలాంటి విషాధ అంచనాల పట్టిక చాలా పొడవుగా ఉంది.
అంతకు ఒక సంవత్సరం ముందు ప్రముఖ ఫోర్బెస్‌ మాగజైన్‌ ''ముగుస్తున్న చైనా అద్భుత ఆర్థిక ప్రగతి'' అనే పతాక శీర్షికతో ఇలానే అంచనావేసింది. ''వేగవంతమైన చైనా వృద్ధికి కాలం చెల్లనుంది'' అని అల్‌ జజీరా కూడా రాసింది. ఇటువంటి అంచనాలు, శీర్షికలతో లోవీ ఇన్స్టిట్యూట్‌, ఫారిన్‌ అఫైర్స్‌ మ్యాగ జైన్‌ వంటి అనేక ప్రచురణ సంస్థలు వ్యాసాలను ప్రచురించాయి. కేవలం ఒక నెల క్రితం న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన ఒక వ్యాసానికి ఈ శీర్షిక పెట్టింది: ''చైనా ప్రగతి పశ్చిమ దేశాలతో సంబంధా లపైన ఆధారపడింది. ఈ సంబంధాలను జిన్‌పింగ్‌ బలహీన పరుస్తున్నాడు''. కోవిడ్‌ నియంత్రణకు చైనా అవలంభించిన జీరో కోవిడ్‌ విధానం చైనా వృద్ధికి, అభివృద్ధికి చావుగంట గా మారుతుందని, తత్ఫలితం గా చైనా అమెరికాను ఎన్నడూ అధిగమించజాలదని పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు వెల్లువై నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నాయి. చైనా జనాభాలో వయసు మీరు తున్న వారి శాతంలో పెరుగుదల, శిశు జననాల రేటు పడిపోవటంవంటి కారణాలచేత ఆ దేశానికి అంతర్జాతీయంగా పోటీపడే శక్తి బలహీన పడుతుందని, అందువల్ల దీర్ఘకాలంలో వృద్ధి కుంటు పడుతుందని సాగే వాదనలు ఈ వ్యాసాలలో కనపడ తాయి. అయితే ఈ వ్యాఖ్యాతలు పట్టించుకోని విషయం ఏమంటే తన ఆర్థిక వ్యవస్థను మేనేజ్‌ చేసుకోగలిగిన సామర్థ్యం పశ్చిమ దేశాలకంటే చైనాకే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఎంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రోజక్టునైనా అతి తక్కువ సమయంలో పూర్తిచేయగల సామర్థ్యం చైనా స్వంతం. వృద్ధి సాధించటానికి ఉపయోగపడే పరిశ్రమలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను సమకూర్చి ప్రోత్సహించ గలగటం చైనా వ్యవస్థకున్న ప్రత్యేకత. వీటన్నింటికీ అనుబంధంగా అపారమైన చైనీస్‌ అంతర్గత మార్కెట్‌ విపరీతమైన వేగంతో విస్తుృతమౌతోంది.
చైనా ప్రగతి అంతం అవుతుందని ఇలా అనేక సంస్థలు, ప్రచురణలు వేసిన అంచనాలు, పుంకాను పుంకంగా రాసిన రాతలు ఎందుకు ఇలా తలకిందు లవుతున్నాయి? ఈ సంవత్సరం ఉంటేగింటే 1శాతం కూడా వృద్ధి రేటులేని అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ఇవే సంస్థలు పరిస్థితి ఆశాజనకంగా ఉందంటూ ఎందుకు ఊదరగొడుతుంటాయి? చైనా గురించి రాసేటప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకో కుండా భావజాలపరమైన, తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా చైనా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు పతనంవైపు పరుగులు తీస్తున్నాయంటూ అమెరికా, దాని కూటమి దేశాల మీడియా మహాకథనాలను వండివారుస్తుంటాయి.
నేటి ప్రపంచంలో చైనా అప్రతిహత ఆర్థిక ప్రగతి కొందరికి మరింత భయాందోళనలు కలిగించే విషయంగా మారింది. ఎందుకంటే అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపా దేశాలు ప్రవచిస్తున్న భావ జాలం చైనా నమూనా, సోషలిస్టు భావజాలం ముందు వీగిపోతున్నదన్న భావన ఈ దేశాలలో ఉన్నది. మానవాళి దశను, దిశను నిర్ణయించే సంస్కృతి పశ్చిమ దేశాల సొత్తు అని, మిగిలిన ఆలోచనా స్రవంతులన్నీ తప్పుడుతడకలనే భావన అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలకు ఉంది. మానవ చరిత్ర పరస్పర వ్యతిరేక శక్తుల ఘర్షణలతో నిరంతరం ముందుకు సాగుతూనే వుంటుందనే హెగెల్‌ గతి తర్కానికి, మార్క్స్‌ గతితార్కిక భౌతికవాదానికి ప్రతిగా ఫ్రాన్సిస్‌ ఫుకుయామా ''చరిత్ర ముగిసింది'' అనే వ్యాసాన్ని 1989లో ప్రచురించాడు. చారిత్రిక పరిణామ క్రమంలో అంతిమంగా లిబరల్‌ ప్రజాస్వామ్యం విజేతగా నిలిచిందని, అదే అన్ని దేశాలకు ప్రభుత్వ రూపంగా ఉంటుందని ఫుకుయామా సూత్రీకరించాడు. అయితే వైరుధ్యభరితమూ, నిత్య సంక్షుభితమూ అయిన పెట్టుబడిదారీ వ్యవస్థ పునాధిగావున్న లిబరల్‌ ప్రజాస్వామ్యం సార్వజనీనమైన అంతిమ రాజకీయ వ్యవస్థగా మనజాలదని మనకు చరిత్ర నిరంతరం గుర్తుచేస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో రష్యా డాలర్‌ నిధులను కైవసం చేసుకుని, ఆ దేశంపైన పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ప్రపంచ దేశాలను మేల్కొలిపాయి. అమెరికా తనకు నచ్చని ఏ దేశంపైనైనా ఇటువంటి చర్యలు చేపట్టే వీలుంటుంది గనుక డాలర్లలో నిధులను ఉంచుకో వటం తమ ఆర్థిక భద్రతకు విఘాతమని వివిధ దేశాలు భావిస్తున్నాయి. తత్ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్యంలో అనేక దేశాలు స్థానిక కరెన్సీలను పరస్పరం ఆమోదిం చుకుంటున్నాయి. రష్యాలాంటి కొన్ని దేశాలు చైనీస్‌ యువాన్‌లో కూడా తమ వాణిజ్యాన్ని కొనసాగి స్తున్నాయి. ఆవిధంగా ఏర్పడిన బహుళ ధృవ ప్రపంచం దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొంది స్తోంది. చైనాకు రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వామి అయింది. రష్యా సహజ వనరులు, చైనా పారిశ్రామిక ఉత్పత్తులు పరస్పరం లాభసాటిగా మారాయి. చైనా, రష్యా భాగస్వామ్యం ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాలను అధిగమిం చటానికి, ఆర్థికంగా, సాంకేతికంగా ఎదగటానికి సానుకూల అవకాశాలను అందిస్తుంది. ఈ రెండు దేశాల భాగ స్వామ్యం ఇప్పటికే పశ్చిమ దేశాలకు సవా లుగా మా రింది. రష్యా సహజ వనరులు లేకపోతే పశ్చిమ దేశా లలో సరుకుల ఉత్పత్తి వ్యయం పెరిగి అంతర్జాతీయ వాణిజ్యంలో చైనాతో పోటీకి నిలువ లేవు. తమ ప్రయోజనాలను పట్టించుకోకుండా అమెరికా ప్రయో జనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నందుకు పశ్చి మ దేశాలు చెల్లిస్తున్న మూల్యం ఇది.ఒక ప్రత్యా మ్నాయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థగా చైనా తన లోపా లను సవరించుకుంటూ మరింత సమన్వయంతో అసమానతలను అధిగమిస్తూ మరింతగా ముందుకు సాగిపోయే దిశలో చైనా పయని స్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉక్రెయిన్‌కు అమెరికా మిస్సైల్‌ రక్షణ వ్యవస్థ
అరబ్‌ లీగ్‌లో సిరియా చేరితే కలవరపడేది అమెరికానే : చైనా
ఆ ఘర్షణలు బీజేపీ కుట్రే
గ్రీస్‌ వర్సిటీ ఎన్నికల్లో కమ్యూనిస్టు మద్దతుదారుల జయభేరి
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఫ్రెంచ్‌ ప్రభుత్వం
అమెరికా ఆజ్యంతో మండుతున్న ఉక్రెయిన్‌ రావణ కాష్టం!
రష్యా చమురు దిగుమతిపై ఆంక్షలు
ఇమ్రాన్‌ అరెస్టు అక్రమం
సిరియాను తిరిగి చేర్చుకున్న అరబ్‌ లీగ్‌
భారత్‌లో మాతా శిశు మరణాలు ఎక్కువే
ట్రంప్‌ దోషే...
ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్‌
రక్తపాతాలు, కుట్రలను పురిగొల్పేది పెత్తందారీ శక్తులే !
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు
బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కి పట్టాభిషేకం
సెర్బియాలో మూకుమ్మడి హత్యలు
ఇంగ్లండ్‌ స్థానిక ఎన్నికల్లో పేలవమైన పనితీరును కనబరిచిన టోరీలు ముందంజలో లేబర్‌ పార్టీ, లిబరల్‌ డెమోక్రాట్లు
ముగ్గురు పాలస్తీనియన్లను హతమార్చిన ఇజ్రాయిల్‌ మిలటరీ
పాక్‌లో స్కూలును చుట్టుముట్టిన సాయుధులు
పుతిన్‌పై హత్యాయత్నం ?
ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా
జూన్‌ 1కల్లా రుణాల చెల్లింపు సంక్షోభంలో అమెరికా !
చైనాతో ఆర్థిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్న మలేషియా
లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న చైనీస్‌ యువాన్‌
ప్రతి దాడి విఫలమైతే... ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల మద్దతును కోల్పోతుంది..!
భద్రతా మండలిని విస్తరించాలి : రష్యా విజ్ఞప్తి
ఉత్తర కొరియాను నిలువరించేందుకు అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణు ఒప్పందం
ఉక్రెయిన్‌కి నాటో సైనిక సహాయం
టర్కీ సార్వత్రిక ఎన్నికలు
ప్రధాని మోడీ..విషపూరితమైన పాము !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.