Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రష్యా ఆర్థిక వ్యవస్థ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Apr 24,2023

రష్యా ఆర్థిక వ్యవస్థ

- పాశ్చాత్య 'నిష్ణాతుల' తప్పుడు లెక్కలు!
నెల్లూరు నరసింహారావు
            తమకు ఇష్టంలేని వాస్తవాలను దాచటం ఇక సాధ్యం కాదని తేలిన తరువాతే పాశ్చాత్య మీడియా అనేక వంకరటింకర వివరణలతో వాటిని ప్రచురిస్తుంది. ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక చేసిన నిర్ధారణ ఏమంటే అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ జీ-7 (అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ, ఇటలీ) దేశాల ఆర్థిక వ్యవస్థలు కుచించుకుని పోతుండగా బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) దేశాల ఆర్థిక వ్యవస్థలు ముందుకు సాగుతున్నాయి.
గతంలో ఈ వాస్తవాన్ని గుర్తించటానికి పాశ్చాత్య మీడియా నిరాకరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ దేశాల వాటాను జీ-7 దేశాల వాటాతో పోల్చటానికి 2032వ సంవత్సరందాకా పడుతుందని 2007లో పాశ్చాత్య నిష్ణాతులు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఇలా మరోసారి పాశ్చాత్య ఆర్థిక అంచనాలు విఫలమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ దేశాల వాటా జీ-7 దేశాల వాటా స్థాయికి 2020లోనే చేరింది. ఎన్ని రకాల ఎత్తులకు, జిత్తులకు పాల్పడినప్పటికీ తాజా అంచనాల ప్రకారం 2028కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ-7 దేశాల వాటా 27.8శాతంవుండే అవకాశం ఉండగా బ్రిక్స్‌ దేశాల వాటా కనీసం 35 నుంచి 40 శాతానికి చేరుకుంటుంది.
రష్యా ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన దాని ప్రభావం గురించి ఇటువంటి అరకొర అంచనాలనే పాశ్చాత్య విశ్లేషకులు చేశారు. ఈ విశ్లేషణలు ప్రపంచ నిగూఢ రాజ్య(గ్లోబల్‌ డీప్‌ స్టేట్‌) ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంటాయి. ముందుగా రష్యా ఆర్థిక వ్యవస్థను, ఆ తరువాత ఆ దేశ సామాజిక సమగ్రతను నాశనం చేయటానికి గత సంవత్సరానికిపైగా రష్యాపైన పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు చరిత్రలో మరే దేశంపైనా విధించబడలేదు. ఇటువంటి అంచనా వెనుక వాస్తవాల కంటే సమిష్టి పాశ్చాత్య దేశాల ఆర్థిక సత్తా ముందు రష్యా ఎంత? అనే దురహంకారం ఉంది.
ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తరువాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల పరంపరను అధిగ మించటానికి రష్యా అనేక ప్రతిచర్యలను తీసుకుంది. నిజానికి యుద్ధానికి ముందే రష్యా ద్రవ్య వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చింది. అలా చేసివుండకపోతే వీసా, మాస్టర్‌ కార్డులు రష్యా నుంచి వైదొలిగినప్పుడు ఆ ప్రభావం రష్యాపై తీవ్రంగా ఉండేదే. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికే ''మీర్‌ ఇండిపెండెంట్‌ నేషనల్‌ పేమెంట్‌ సిస్టమ్‌''ని 2015లోనే రష్యా కేంద్ర బ్యాంకు, ఫైనాన్స్‌ మినిస్ట్రీ రూపొందించాయి. దీనితో విదేశీ చెల్లింపుల వ్యవస్థ నిష్క్రమించినప్పటికీ అది రష్యాపై అంతగా ప్రభావాన్ని చూపలేదు. అలాగే రూబుల్‌ని రక్షించేందుకు రష్యా తీసుకున్న చర్యలు విజయవంతం కావటం కూడా రష్యాకు కలిసివచ్చింది. 2022 మార్చిలో డాలర్‌తో మారకంలో రూబుల్‌ విలువ 121.5కు పడిపోయింది. రష్యా నుంచి ఎగుమతి అయ్యే చమురుకు చెల్లింపులు రూబుల్‌లో జరగాలని రష్యా పట్టుబట్టటంతో రూబుల్‌ మీద వత్తిడి తగ్గింది. ఈలోపు చమురు, గ్యాస్‌ ధరలు పెరగటంతోను, దిగుమతులు తగ్గటంతోను రష్యా మార్కెట్లు విదేశీ మారకపు ద్రవ్యంతో నిండిపోయాయి. ప్రస్తుతం డాలర్‌ 81 రూబుల్స్‌గా ఉంది. వీటికి తోడుగా దేశీయ పరిశ్రమను రక్షించటానికి తీసుకున్న చర్యలు రష్యా ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాయి.
ప్రపంచంలోనే అత్యంత సువిశాల దేశమైన రష్యా ఆర్థిక వ్యవస్థ ఇటలీ ఆర్థిక వ్యవస్థను మించి ఉండదని పాశ్చాత్య దేశాల నిష్ణాతులు సూత్రీకరిస్తుంటారు. ఈ సూత్రీకరణ చేసేటప్పుడు కరెన్సీలలో తేడాలను, అప్పుల కుప్పగావుండే సేవారంగాన్ని అతిగా విలువ కట్టటం వంటి విషయాలను పరగణనలోకి తీసుకోవటం జరగలేదు. అయినప్పటికీ ఇటువంటి అంచనాలలో ఎక్కడో ఏదో తేడా కొట్టింది. వీరి అంచనాలకు అనుగుణంగా రష్యా సాగిలపడలేదు సరికదా కనీసం తొణకలేదు. గ్లోబల్‌ ఎనర్జీ సూపర్‌ పవర్‌ గానే కాకుండా తాజాగా గ్లోబల్‌ ఫుడ్‌ సూపర్‌ పవర్‌గా కూడా రష్యా స్థాయి మరోసారి ఖాయం అయింది. రష్యా పతనం గురించి కన్న కలలు నిజం కాకపోవటానికి తమ లెక్కల్లో తప్పులు దొర్లటమే కారణమని పాశ్చాత్య నిష్ణాతులు గ్రహించారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనంచేసి, ఆ దేశాన్ని పాదా క్రాంతం చేసుకోవాలనే పాశ్చాత్య ఆలోచన ఎందుకు విఫలమైందో చూద్దాం. రష్యా, ఇటలీ ఆర్థిక వ్యవస్థలను పోల్చటంలోనే పాశ్చాత్య నిష్ణాతుల ఘోరమైన అసమర్థత దాగివున్నదని నేషనల్‌ ఇంటరెస్ట్‌ అనే అమెరికన్‌ మ్యాగజైన్‌లో ప్రచురింప బడిన ఒక వ్యాసంలో రచయితలు పేర్కొన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే పోలిక మూలాలు ఆర్థిక వ్యవస్థలను నామినల్‌ జీడీపీతో పోల్చే పద్ధతిలో ఉన్నాయి. ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయ్యే సరుకులు, సేవల మొత్తం విలువను నామినల్‌ జీడీపీ అంటారు. 2013లో ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం రష్యా నామి నల్‌ జీడీపీ 2.29 ట్రిల్లియన్‌ డాలర్లు, ఇటలీ నామినల్‌ జీడీపీ 2.14 ట్రల్లియన్‌ డాలర్లు. ఈ గణన పద్ధతిలో మౌలికంగా లోపాలు న్నాయి. గ్లోబల్‌ బ్రాండ్లు, కాపీ రైట్స్‌ వంటి 'పేపర్‌ ఆస్తుల'కు భిన్నంగా జీవన ప్రమాణాలకు సర్దు బాటు చేసిన మారకపు విలువ, కొను గోలు శక్తి సమానత(పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ, పీపీపీ), శ్రామిక ఉత్పాదకత, తలసరి సంపద, అన్నింటికంటే ముఖ్యంగా అందుబాటు లోవున్న భౌతిక వనరులు, వస్తువులను పరిగణనలోకి తీసుకోకుండా వేసిన లెక్కలవి.
ఈ ఒక్క లోపాన్ని సరిదిద్ది రష్యా వాస్తవ జీడీ పీని గణిస్తే అది నాలుగవ అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన జర్మన్‌ జీడీపీకి దగ్గరగా ఉంది: ఈ గణన ప్రకారం 2021లో రష్యా జీడీపీ 4.81 ట్రిల్లియన్ల డాలర్లుగా ఉంటే జర్మనీ జీడీపీ 4.85 ట్రిల్లియన్ల డాలర్లుగా ఉంది. కానీ ఇటువంటి మెరుగుపర్చబడిన గణాంకాలు కూడా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిం చవు. సంక్షోభ సమయంలో భౌతిక వస్తువుల ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయంలో రష్యా ఆర్థిక వ్యవస్థ జర్మన్‌ ఆర్థిక వ్యవస్థకంటే పెద్దది. ఇది ఫ్రెంచ్‌ ఆర్థిక వ్యవస్థకు రెండు రెట్లు ఉంటుంది. ఇదేకాకుండా ప్రపంచ ఇందన అవసరాలను తీర్చటంలోను, ముఖ్య మైన సహజ వనరులను, ఆహార పదార్థాలను సరఫరా చెయ్యటంలోను రష్యా ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ప్రపంచ భద్రతపై వీటి ప్రభావాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉక్రెయిన్‌కు అమెరికా మిస్సైల్‌ రక్షణ వ్యవస్థ
అరబ్‌ లీగ్‌లో సిరియా చేరితే కలవరపడేది అమెరికానే : చైనా
ఆ ఘర్షణలు బీజేపీ కుట్రే
గ్రీస్‌ వర్సిటీ ఎన్నికల్లో కమ్యూనిస్టు మద్దతుదారుల జయభేరి
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఫ్రెంచ్‌ ప్రభుత్వం
అమెరికా ఆజ్యంతో మండుతున్న ఉక్రెయిన్‌ రావణ కాష్టం!
రష్యా చమురు దిగుమతిపై ఆంక్షలు
ఇమ్రాన్‌ అరెస్టు అక్రమం
సిరియాను తిరిగి చేర్చుకున్న అరబ్‌ లీగ్‌
భారత్‌లో మాతా శిశు మరణాలు ఎక్కువే
ట్రంప్‌ దోషే...
ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్‌
రక్తపాతాలు, కుట్రలను పురిగొల్పేది పెత్తందారీ శక్తులే !
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు
బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కి పట్టాభిషేకం
సెర్బియాలో మూకుమ్మడి హత్యలు
ఇంగ్లండ్‌ స్థానిక ఎన్నికల్లో పేలవమైన పనితీరును కనబరిచిన టోరీలు ముందంజలో లేబర్‌ పార్టీ, లిబరల్‌ డెమోక్రాట్లు
ముగ్గురు పాలస్తీనియన్లను హతమార్చిన ఇజ్రాయిల్‌ మిలటరీ
పాక్‌లో స్కూలును చుట్టుముట్టిన సాయుధులు
పుతిన్‌పై హత్యాయత్నం ?
ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా
జూన్‌ 1కల్లా రుణాల చెల్లింపు సంక్షోభంలో అమెరికా !
చైనాతో ఆర్థిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్న మలేషియా
లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న చైనీస్‌ యువాన్‌
ప్రతి దాడి విఫలమైతే... ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల మద్దతును కోల్పోతుంది..!
భద్రతా మండలిని విస్తరించాలి : రష్యా విజ్ఞప్తి
ఉత్తర కొరియాను నిలువరించేందుకు అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణు ఒప్పందం
ఉక్రెయిన్‌కి నాటో సైనిక సహాయం
టర్కీ సార్వత్రిక ఎన్నికలు
ప్రధాని మోడీ..విషపూరితమైన పాము !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.