Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్ సంక్షోభంపై జిన్‌పింగ్
బీజింగ్ : ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్చలు, సంప్రదింపులే ఏకైక మార్గమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బుధవారం అన్నారు. అణు యుద్ధంలో ఎవరికీ విజయం లభించదని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడుతూ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా-ఉక్రెయిన్ సంబం ధాలపై, ఉక్రెయిన్ సంక్షోభంపై ఉభయ పక్షాలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాయి. యురేసియన్ వ్యవహారాలపై చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని ఉక్రెయిన్‌లో, ఇతర దేశాల్లో పర్యటించడానికి పంపనున్నట్లు జిన్‌పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారంపై అన్ని పక్షాలతో కూలంకషమైన చర్చలు జరిపేందుకే పంపుతున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయని పేర్కొన్నారు. చైనాతో సహకారానికి సంబంధించి, అలాగే ఇరు దేశాల సంబంధాల అభివృద్ధిపై జెలెన్స్కీ పదే పదే చేసిన వ్యాఖ్యలను జిన్‌పింగ్ ప్రశంసించారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల పరస్పర గౌరవం అనేది ద్వైపాక్షిక సంబంధాలకు రాజకీయ పునాది వంటిదని అన్నారు. భవిష్యత్‌పై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ఇరు పక్షాలను ఆయన కోరారు. ఉక్రెయిన్‌తో సంబంధాలను అభివృద్ధిపరుచుకోవడానికి చైనా సుముఖతతో వుందన్నారు.