అందరూ తాతముత్తాతల ఆస్తులకు మాత్రమే వారసులుగా ఉంటారు. అతి కొద్దిమంది మాత్రమే ఆ తాతల మంచితనాన్ని, మానవత్వాన్ని, అభ్యుదయాన్ని వారసత్వంగా స్వీకరిస్తారు. అలాంటి వారిలో మల్లు అరుణ్ ఒకరు. కేవలం పేరులోనే కాదు అతని రక్తంలో కూడా అభ్యుదయ భావాలు ఉన్నాయి. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి సేవా భావాలను అందిపుచ్చుకున్నాడు. వైద్యుడిగా పేదలకు తనకు చేతనైనంత సేవ చేస్తున్నాడు. తాతకు తగ్గ మనవడిగా,