Authorization
Sat May 03, 2025 03:07:51 pm
- రోజూ రెండుసార్లు మంచి నీటితో చర్మాన్ని శుభ్రపరచండి. ఒకవేళ మీకు చెమట ఎక్కువగా వస్తుంటే రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిది.
- స్నానం చేశాక బట్టలు ధరించే ముందు మీ చర్మాన్ని పూర్తిగా తుడుచుకోండి. అంతేకాక సరిగ్గా ఆరిన బట్టలనే వేసుకోండి. బయటకి వెళ్లే ముందు పౌడర్ జల్లుకోండి. ఎందుకంటే ఇది అధిక తేమను గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, హీటింగ్ సమస్యలను నివారిస్తుంది.
- హైపర్ పిగ్మెంటేషన్, చర్మ సున్నితత్వంతో బాధపడేవారు సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం.
- బిగుతుగా ఉన్న పాదరక్షలను ధరించకండి. బిగుతుగా ఉన్న పాదరక్షలను ఎక్కువసేపు ధరించడం వల్ల వేళ్ల మధ్య చెమట చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాక్స్ లేదా బూట్లు ధరించే ముందు మీ పాదాలను పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
జట్టు సంరక్షణకు..
వేసవి కాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా అధికమవుతుంటాయి. వీటిని అరికట్టేందుకు వారానికి కనీసం రెండుసార్లు మీ జుట్టును శుభ్రపర్చుకోండి. దురద లేదా చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు యాంటీ డాండ్రఫ్ షాంపూని క్రమం తప్పకుండా ఉపయోగించండి. వేసవిలో మీ జుట్టుకు అదే పనిగా నూనె రాయకండి. ఎందుకంటే ఇది మాడు సమస్యలకు దారితీస్తుంది. దీనికి బదులు వారానికి ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. షాంపూ రాసిన గంట లేదా రెండు, మూడు గంటల తర్వాత తలస్నానం చేస్తే మంచిది. పై చర్యలు పాటించినా సరే మీకు చర్మం, జుట్టుకి సంబంధించిన సమస్యలు వస్తుంటే చర్మవ్యాధి నిపుణులని సంప్రదించండి.