Authorization
Sat May 03, 2025 02:04:52 am
కరోనా ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది. దీని నుండి బయటపడాలంటే... చేతులని మీ ముందుకి తెచ్చి వాటిని ఒకదానితో ఒకటి పట్టుకోండి. ఇప్పుడు మీ చేతులని తల మీదుగా పైకె తీసుకువెళ్ళి శ్వాస తీసుకోండి. ఆ తర్వాత వాటిని కండ్లకి సమాంతరంగా తీసుకు వచ్చి ఊపిరి వదలండి. మీ చేతులతో మీ తల వెనక వైపున పట్టుకోండి. ఇప్పుడు చేతులు తెరిచి ఊపిరి తీసుకుని మళ్ళీ చేతులు వెనక్కి పెట్టి ఊపిరి వదలండి. దీన్ని ప్రతి రోజూ కనీసం ఆరేడు సార్లు చేయాలి.