Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాస్తే సరి. జిడ్డుతత్వం తగ్గి చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.
రెండు కప్పుల ఉసిరిపొడిలో కప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసం కలిపి తలకు ప్యాక్ వేస్తే వెంట్రుకలు మదువుగా మారతాయి. దాంతో పాటు చుండ్రు సమస్య తగ్గుతుంది.
అరకప్పు నువ్వుల నూనెలో గుప్పెడు గులాబీ రేకలు, చెంచా మెంతులు వేసి మరిగించండి. ఈ మిశ్రమాన్ని ఒంటికి నలుగులా రాసి మర్దన చేస్తే సరి. ఇలా రోజూ చేస్తుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
పావు కప్పు బాదం ముద్దకు కొద్దిగా వట్టివేళ్లపొడి, చెంచా కస్తూరి పసుపు, రెండు చెంచాల అముదం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ, చేతులు, ముఖానికి రాసి చేతుల్ని నీళ్లతో తడుపుతూ మదువుగా మర్దన చేయాలి. ఇలా చూస్తే మతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
కోడిగుడ్డు తెల్లసొనలో కాస్త ఆలివ్ నూనె, చెంచా నిమ్మరసం వేసి బాగా గిలకొట్టాలి. దాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించి అరగంటయ్యాక కడిగేస్తే చాలు. పోషణ అందుతుంది. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది.
బయట ఎక్కువగా తిరిగే వారు...ఇంటికి వచ్చాక బొప్పాయి గుజ్జులో కొన్ని పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే...చర్మానికి ఉపశమనం కలుగుతుంది. ముడతలు రావు.