Authorization
Fri May 02, 2025 12:58:03 pm
ఇంటి నుంచి పనిచేసే మహిళలకు సందేహాల నివృత్తి నుంచి పిల్లల చదువు వరకు ప్రతి దానికీ గాడ్జెట్స్ వాడక తప్పని పరిస్థితి. ఇది మానసిక ఆరోగ్యం, కుటుంబ సంబంధాల మీదా ప్రభావం చూపుతోందంటున్నారు నిపుణులు. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం...
సిస్టమ్‌కీ, టీవీకీ చివరికి మొబైల్‌కి కూడా దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఆదివారం 'టెక్ హాలిడే' అనుకున్నారనుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఫోను లేనిదే నిమిషం గడవదు. ఏవైనా అర్జెంట్ కాల్స్ వస్తే... దీనికీ ముందుగానే సిద్ధమవ్వండి. ఆరోజంతా మీకు ఫోన్ అందుబాటులో ఉండదన్న విషయాన్ని తోటి ఉద్యోగులకీ, కుటుంబ సభ్యులకీ తెలియజేయండి. స్విచాఫ్‌లో పెట్టండి. మొబైల్ లేకముందు ఎలా ఉండేవారో అలాగే ప్రయత్నించండి. అలాగని ఏ సినిమాకో.. టెక్ ఆటలకో మాత్రం చెక్కేయకండి. వీటన్నింటికీ దూరంగా ఉండటమే ఉద్దేశం. కాలక్షేపం కావాలంటే.. ఏ పుస్తకమో చదవండి, పచ్చగా ఉండే చోటికి షికారుకి వెళ్లండి. స్నేహితులతో కబుర్లు చెప్పండి. హాలిడే వంటి వాటికి వెళ్లినా అవసరమైతే తప్ప దీన్ని పక్కన పడేయాలి. డిజిటల్ డీటాక్సింగ్గా వ్యవహరిస్తున్న దీన్ని ఆచరిస్తే.. సృజనాత్మకతకీ ఆస్కారముంటుంది అంటున్నారు నిపుణులు. ఆడవాళ్లకి టెక్నాలజీ కారణంగా ఎక్కువ ఆత్రుత, ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో టెక్ విరామం ఆవశ్యకమంటున్నారు.