Authorization
Sat May 03, 2025 07:11:36 pm
చలికాలంలో గొంతునొప్పి చాలా సాధారణం. దీంతో గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. తినడం కూడా కష్టతరమవుతుంది. గొంతు నొప్పిని నయం చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు...
కప్పు వేడినీటిలో అర టీస్పూన్ పసుపు, టీస్పూన్ ఉప్పు కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. దీంతో ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది.
వేడినీటిలో కాస్త తేనె వేసి కలపాలి. కొద్దిగా నిమ్మరసం జోడించి ఆ పానీయాన్ని తాగాలి. దీంతో గొంతు ఇన్ఫెక్షన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పచ్చివెల్లుల్లి యాంటిసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. గొంతు సమస్యలను తొలగించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. అల్లిసిన్ పచ్చి వెల్లుల్లి రసం నుంచి లభిస్తుంది.
గ్లాసు గోరువెచ్చని నీటిలో టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించాలి. గార్గ్లింగ్ ప్రక్రియను రోజంతా కనీసం మూడుసార్లు అనుసరించాలి.