Authorization
Thu April 10, 2025 02:51:37 pm
సాధారణంగా రుతుస్రావం సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాము. వాటి వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అవేంటో చూద్దాం...
బహిష్టు సమయంలో శానిటరీ ప్యాడ్లను కనీసం 4 గంటలకు ఒకసారి వాటిని మార్చడం అవసరం. ఇది మిమ్మల్ని అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుండి నివారిస్తుంది.
వ్యాక్సింగ్ అనేది వ్యక్తిగత ఎంపిక. కానీ పీరియడ్స్ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వ్యాక్సింగ్‌కు దూరంగా ఉండండి.
చాలా మంది రుతుస్రావం సమయంలో రక్తస్రావం వాసనను నిరోధించడానికి పెర్ఫ్యూమ్లు లేదా సువాసనగల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఇందులో ఉండే రసాయనాలు జననాంగాల్లోని సున్నితమైన ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి.
హార్మోన్ల అసమతుల్యత, మూడ్‌లో తరచుగా మార్పులు, చిరాకు కోపం వంటివి పీరియడ్స్ సమయంలో ప్రభావితం చేస్తాయి. అందువల్ల, మంచి నిద్ర అవసరం.
చాలా మంది శక్తివంతంగా ఉండేందుకు పీరియడ్స్ సమయంలో ఎక్కువగా కాఫీ తాగడం అలవాటు చేసుకున్నారు. కెఫిన్ శరీర ద్రవాలను తగ్గిస్తుంది, పీరియడ్స్ నొప్పిని పెంచుతుంది. అలాగే పీరియడ్స్ రోజుల్లో జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.