Authorization
Thu April 10, 2025 05:44:55 pm
కాస్త ఓపిక, శ్రద్ధ పెడితే చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా చేయడంతో పాటు చర్మ పోషణకు అవసరమయ్యే పోషకాలను కూడా అందించవచ్చు. దీనికి సహజసిద్ధంగా లభించే అరటిపండు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం..!
బాగా మగ్గిన అరటిపండు ఒకటి, చెంచా తేనె, చెంచా బార్లీపౌడర్ తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. అరటిపండు చర్మాన్ని పట్టి ఉండదు. వెంటవెంటనే జారిపోతూ ఉంటుంది. అందుకే ఇది చర్మానికి పట్టి ఉండేలా చేయడానికే ఇందులో బార్లీపౌడర్ కలిపాం. అరటిపండు బాగా ముగ్గినదైతే బార్లీపౌడర్కు బదులు వరిపిండి చెంచా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కింద నుంచి పైకి పూతలా వేసుకోవాలి. 30 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ఎంత సహజంగా ఆరితే అంత ప్రయోజనం ఉంటుంది. ఇలా వారానికోసారి ఈ ఫేస్‌ప్యాక్‌ను అప్త్లె చేసుకోవచ్చు. దీని వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా దరి చేరవు. అలాగే చర్మం కూడా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.