Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖం, చేతులపై ర్యాష్ ఉన్నట్లయితే బకెట్ నీళ్లలో కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని ఆ నీటితో ముఖాన్ని, చేతుల్ని తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ఆపై గంధం ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం గంధం అరగదీసి నేరుగా మచ్చలున్న చోట అప్లై చేసుకోవాలి. లేదంటే గంధంలో రోజ్‌వాటర్ వేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు.. ఇలా ర్యాష్ ఉన్న భాగాల్లో పూతలా వేసుకొని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకోసారి పదిహేను రోజుల పాటు చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.