Authorization
Sun April 06, 2025 09:05:13 pm
ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల ఆ వెలుగు పూర్తిగా కండ్ల పై పడుతుంది. ఎలాగైనా ఈ అలవాటును మానుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు నిపుణులు. మొబైల్ చూడడం వల్ల దుష్ప్రభావాలేంటో మనలో చాలామందికి తెలీదు. అప్పటి వరకూ మూసుకొని ఉన్న కండ్లపై ఎక్కువ కాంతి పడడం వల్ల కండ్లు పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోజంతా కండ్లు అంత ప్రభావవంతంగా పనిచేయలేవు. ఈ అలవాటు మానేస్తే తప్ప ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేం.
మొబైల్ చూడడం అలవాటు ఉంటే ఆ తర్వాత యోగా, మెడిటేషన్ చేయడం.. ముఖం కడుక్కోవడం వంటివేవి చేసినా కంటి నొప్పి తగ్గదు. అందుకే కండ్లను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ అలవాటును దూరం చేసుకోవాల్సిందే. అయితే కండ్లు మసక మసకగా కనిపిస్తాయి. భవిష్యత్తులో ఇది అనర్థాలకూ దారి తీసే అవకాశం ఉంటుంది. వయసు మీరే కొద్దీ కండ్లు కనిపించకపోవడం సాధారణమే కానీ, వయసులో ఉండగా కనిపించకపోతే కొంచెం డేంజరే.
ఉదయం మొబైల్‌ని నిద్రలేచిన వెంటనే చూడడం వల్ల మొబైల్ తాలూకు లైట్ కిరణాలు మన కండ్లపై పడి లోపలికి చొచ్చుకుపోతాయి. ఇది మన కండ్లకు అంత మంచిది కాదు. అలాగే మొబైల్ వాడకం వల్ల రోజంతా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. తల చాలా బరువుగా అనిపిస్తుంది. రోజంతా తలనొప్పిగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఉదయాన్నే లేచి ఫోన్ చూసుకునే అలవాటు మీకుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే దాన్ని మార్చుకుంటే రోజంతా ఫ్రెష్‌గా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.