Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాగితో తయారుచేసిన వస్తువులు అందంగా ఉండటం మాత్రమే కాదు.. ఇంటికి కొత్త కళను అందిస్తాయి. అయితే వీటిని శుభ్రం చేసే విషయంలో కాస్త ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే.. వాటిని శుభ్రం చేయడానికి మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తే.. రాగి వస్తువులు మెరిసే గుణాన్ని కోల్పోతాయి. అలాగని శుభ్రం చేయకుండా వదిలేస్తే.. రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. కాబట్టి ఇలాంటి వస్తువుల్ని తళతళా మెరిపించాలంటే టొమాటో కెచప్ ఉపయోగిస్తే సరి.. దీనికోసం టొమాటో కెచప్‌ను రాగి వస్తువుపై పల్చని పొరలా పూయాలి. 15-20 నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత మెత్తని నూలు వస్త్రంతో తుడిచి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఒకవేళ వస్తువుపై ఎక్కడైనా మచ్చలాగా ఉంటే అక్కడ మరోసారి కెచప్ పూసి పావుగంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది.