Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవనశైలి మార్పులూ, ఇతరత్రా కారణాలతో... పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్(పీసీఓఎస్) బారిన పడుతోన్న మహిళల సంఖ్య ఎక్కువే. దీనికి పరిష్కారంగా మందులు వాడటం, వ్యాయామం చేయడమే కాదు... ఆహారంలోనూ తగినన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
మెంతులను: రక్తంలో చక్కెరస్థాయులను అదుపులో ఉంచి ఇన్సులిన్‌ను క్రమం తప్పకుండా చూస్తాయివి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. రోజూ పావుకప్పు గోరువెచ్చని నీటిలో చిటికెడు మెంతిపిండి కలిపి తాగితే చాలు.
రాగులు: గ్లూటెన్ ఫ్రీగా పిలిచే రాగుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ పిండితో చేసే రోటీ, దోశ, జావ వంటివి రోజూ తినొచ్చు.
పచ్చగా: ముదురాకుపచ్చని ఆకుకూరల్లో పీచు ఎక్కువగా, కెలోరీలు తక్కువగా ఉండటంతో అధికబరువు సమస్య అదుపులో ఉంటుంది. బి విటమిన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ సమన్వయం అవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది,
అవిసెలు: పీచు, ఒమేగా-3 నిండుగా ఉండే ఈ విత్తనాలు యాండ్రోజన్ స్థాయులను తగ్గిస్తాయి. పీసీఓఎస్ సమస్యను అదుపులో ఉంచుతాయి.
ఇంకా మోరంగడ్డలు, బాదం, గుమ్మడి విత్తనాలు, చిక్కుడు, శనగలు, అవకాడో వంటివాటినీ వారానికి కనీసం రెండు మూడు సార్లైనా తీసుకోవాలి.